Breaking News

IPL 2025: పంజాబ్‌ కింగ్స్‌కు శుభవార్త

Published on Mon, 05/26/2025 - 18:46

ఐపీఎల్‌ 2025 ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్‌ కింగ్స్‌కు శుభవార్త అందింది. చేతి వేలి గాయం కారణంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ ప్లే ఆఫ్స్‌ సమయానికి అందుబాటులోకి రానున్నాడు. 

ఈ విషయాన్ని పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ఓ ప్రముఖ వార్తా సంస్థ తమ కథనంలో రాసుకొచ్చింది. చహల్‌ను నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో బరిలోకి దించకూడదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పంజాబ్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన నేపథ్యంలో చహల్‌ విషయంలో రిస్క్‌ తీసుకోకూడదని ఆ జట్టు యాజమాన్యం భావిస్తుంది.

కాగా, చహల్‌ లేని లోటు పంజాబ్‌కు గత మ్యాచ్‌లో (ఢిల్లీతో) బాగా తెలిసొచ్చింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి 206 పరుగుల భారీ స్కోర్‌ చేసినా పంజాబ్‌ దాన్ని కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో చహల్‌ ఆడి ఉంటే పంజాబ్‌ మరో విజయం నమోదు చేసేది. అలా జరిగి ఉంటే నేటి మ్యాచ్‌తో (ముంబై) సంబంధం లేకుండా ఆ జట్టు టేబుల్‌ టాపర్‌గా నిలిచేది.

పంజాబ్‌ ఇవాళ (మే 26) జైపూర్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్‌ టేబుల్‌ టాపర్‌గా నిలుస్తుంది. ముంబై గెలిచినా అగ్రస్థానానికి చేరుకుంటుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు అదనపు ప్రయోజనం (క్వాలిఫయర్‌-1లో ఓడినా ఫైనల్‌కు చేరేందుకు క్వాలిఫయర్‌-2లో పోటీ పడే అవకాశం ఉంటుంది) చేకూరుతుందన్న విషయం తెలిసిందే.

పాయింట్ల పట్టికలో టాప్‌-4లో ఉన్న జట్లు (ప్రస్తుతం)..
గుజరాత్‌- 18 (0.254)
పం‍జాబ్‌- 17 (0.327)
ఆర్సీబీ- 17 (0.255)
ముంబై- 16 (1.292)

నేటి మ్యాచ్‌లో తుది జట్లు (అంచనా)..
పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (wk), ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/ప్రవీణ్ దూబే

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)