Breaking News

ప్రపంచ కప్‌ సాధించడమే లక్ష్యం 

Published on Wed, 02/12/2025 - 07:44

సాక్షి, హైదరాబాద్‌: భారత దేశానికి మహిళా ప్రపంచ క్రికెట్‌ కప్‌ సాధించడమే తన లక్ష్యమని మహిళా క్రికెటర్‌ గొంగడి త్రిష పేర్కొన్నారు. నగరంలోని హయత్‌ ప్లేస్‌ హోటల్‌లో నిర్వహించిన సన్మాన సభలో ఆమె మాట్లాడారు. ‘అండర్‌ –19 టీ–20 ప్రపంచ కప్‌ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. క్రికెట్‌లో మిథాలిరాజ్‌ స్ఫూర్తి. ప్రతి మ్యాచ్‌ ఆడే ముందు ఒక్కటే ఆలోచన ఉంటుంది. బాగా ఆడాలి.  

టీం గెలవాలన్న లక్ష్యంతో గ్రౌండ్‌లోకి వెళతా. ఓవర్‌ కవర్‌ షాట్‌ నా ఫేవరెట్‌. నిద్రలో లేపి ఆడమన్నా ఆడతాను. ఆటలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్‌ కాదు. నిత్యం ప్రాక్టీస్‌ చేయాల్సిందే. ఆరు, ఏడేళ్ల నుంచి ఫిట్నెస్, బ్యాటింగ్, ఆహారపు అలవాట్లలో కోచ్‌ సూచలను పాటిస్తున్నా. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను’ అన్నారు. 

లక్ష్యంతో పనిచేస్తేనే.. 
కేవలం డబ్బు సాయంతో విజయం సాధ్యం కాదు, కష్టపడి, నిర్థేశిత లక్ష్యంతో పనిచేస్తేనే జీవితంలో రాణించగలమని  ఏఆర్‌కే ఫౌండర్‌ ఛైర్మన్‌ రామ్‌రెడ్డి అన్నారు. 2028లో లోకేష్‌  , వెన్నెల మెడల్స్‌ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్రిష తండ్రి, హాకీ ప్లేయర్, ట్రైనర్‌ రామ్‌రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ఐటీసీలో ఉద్యోగం చేస్తూ త్రిషకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించాను. 

మెరుగైన కోచింగ్‌ కోసం 17 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చేశాం. చాలా కష్టనష్టాలను చూశానన్నారు. భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ చిన్నతనంలో కరణం మల్లీశ్వరిని ప్రభుత్వం ఘనంగా సత్కరించినపుడు పోడియం ముందున్న నేను అలా సత్కారం పొందాలని అనుకున్నానని తెలిపారు. 

ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టడంతో ఎంతో మంది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కష్టపడి పనిచేయడం, నిబద్ధత, నమ్మకంతో పనిచేస్తే విజయం సాధించడం తధ్యమని గోపీచంద్‌ అన్నారు. బ్యాడ్మింటన్‌ ఆడని రోజు లేదని టీజీపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ జనార్థన్‌రెడ్డి అన్నారు. త్రిష నిత్యం తన ఆటను మెరుగుపరుచుకుని, వృద్ధిచెందాలని మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రికెట్‌ కోచ్‌ జాన్‌ మనోజ్, మాజీ క్రికెటర్, కామెంటేటర్‌ ఎంఎస్‌కే ప్రసాద్, మాజీ ఐఏఎస్‌ రాజేశ్వర్‌ తివారీ పాల్గొన్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)