షణ్ముగ శ్రీనివాస్‌కు స్వర్ణం... శిరీషకు కాంస్యం

Published on Fri, 05/31/2024 - 04:23

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్‌ మీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్లు పతకాలతో మెరిశారు. గురువారం చెన్నైలో జరిగిన పురుషుల 200 మీటర్ల విభాగంలో నలబోతు షణ్ముగ శ్రీనివాస్‌ స్వర్ణ పతకం సాధించగా... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో ముగద శిరీష కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 21 ఏళ్ల షణ్ముగ శ్రీనివాస్‌ అందరికంటే వేగంగా 21.18 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. 

ఇదే నెలలో భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్‌ కప్‌ చాంపియన్‌షిప్‌లో షణ్ముగ రజత పతకం సాధించాడు. మూడేళ్ల క్రితం కెన్యాలో జరిగిన అండర్‌–20 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌íÙప్‌లో శ్రీనివాస్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 20 ఏళ్ల శిరీష 1ని:03.06 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శిరీష ఖేలో ఇండియా గేమ్స్‌లోనూ కాంస్య పతకం సాధించింది.    

Videos

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

Magazine Story About ChandraBabu Cunning Plans

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)