Breaking News

41 ఏళ్ల తర్వాత..

Published on Wed, 09/27/2023 - 02:07

అశ్వాలతో ముడిపడి ఉన్న క్రీడ ఈక్వెస్ట్రియన్‌.  అశ్వానికి, రైడర్‌కు మధ్య పూర్తి సమన్వయం ఉండాలి. అప్పుడే ఫలితం వస్తుంది. లేదంటే తడబాటు తప్పదు. న్యూఢిల్లీలో ఆసియా క్రీడలు 1951లో మొదలుకాగా... ఇదే వేదికపై 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌ను మొదటిసారి ప్రవేశపెట్టారు. నాటి ఆసియా క్రీడల్లో భారత జట్టు మూడు స్వర్ణాలతో అదరగొట్టింది. ఆ తర్వాత భారత జట్టు ఈ క్రీడాంశంలో మళ్లీ పసిడి పతకం సాధించలేకపోయింది.

41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చైనా గడ్డపై మళ్లీ భారత అశ్వదళం అద్భుతం సృష్టించింది. విపుల్‌ హృదయ్‌ చడ్డా, అనూష్‌ అగర్‌వల్లా, దివ్యాకృతి సింగ్, సుదీప్తి హజేలాలతో కూడిన భారత జట్టు డ్రెసాజ్‌టీమ్‌ ఈవెంట్‌లో మొదటిసారి బంగారు పతకం సాధించి సంచలనం సృష్టించింది. డ్రెసాజ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు చివరిసారి 1986 సియోల్‌ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం లభించింది.

ఈక్వెస్ట్రియన్‌ క్రీడలో భాగమైన ఈవెంటింగ్, పెగ్గింగ్‌ ఈవెంట్‌లలో గతంలో భారత్‌కు పసిడి పతకాలు వచ్చినా డ్రెసాజ్‌ ఈవెంట్‌లో స్వర్ణం రావడం ఇదే ప్రథమం. ఓవరాల్‌గా ఆసియా క్రీడల్లో మూడో రోజు మంగళవారం భారత్‌కు మూడు పతకాలు వచ్చాయి. ఈక్వెస్ట్రియన్‌లో స్వర్ణం రాగా.. సెయిలింగ్‌లో ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. షూటింగ్, జూడో క్రీడాంశాల్లో త్రుటిలో కాంస్య పతకాలు చేజారాయి.

హాంగ్జౌ: ఎవరూ ఊహించని విధంగా ఈక్వెస్ట్రియన్‌ క్రీడాంశంలో భారత బృందం మెరిసింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మళ్లీ స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన డ్రెసాజ్‌ టీమ్‌ ఈవెంట్‌లో విపుల్‌ హృదయ్‌ చడ్డా, అనూష్‌ అగర్‌వల్లా, దివ్యాకృతి సింగ్, సుదీప్తి హజేలాలతో కూడిన భారత జట్టు 209.205 పాయింట్లు సాధించి పసిడి పతకం సొంతం చేసుకుంది. చైనా (204.882 పాయింట్లు) రజతం, హాంకాంగ్‌ (204.852 పాయింట్లు) కాంస్య పతకం గెల్చుకున్నాయి.

ఇంటికి దూరంగా.. 
ఆసియా క్రీడల చరిత్రలో డ్రెసాజ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. ఈ స్వర్ణ పతకం వెనుక భారత రైడర్ల శ్రమ ఎంతో దాగి ఉంది. విపుల్, అనూష్, దివ్యాకృతి, సుదీప్తి కొన్నేళ్ల క్రితం భారత్‌ నుంచి యూరోప్‌కు వెళ్లి కుటుంబసభ్యులకు దూరంగా నివసిస్తూ అక్కడే శిక్షణ తీసుకుంటున్నారు. ఆసియా క్రీడల కోసం భారత ఈక్వె్రస్టియన్‌ సమాఖ్య వీరి కోసం యూరోప్‌లోనే ట్రయల్స్‌ కూడా నిర్వహించింది.

ఈ నలుగురి అశ్వాలను జర్మనీలో ఏడురోజులపాటు క్వారంటైన్‌లో పెట్టాక ఈనెల 21న చైనాకు తరలించారు. ‘ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడం నమ్మశక్యంగా లేదు. ఇక్కడి దాకా మా అందరి ప్రయాణం ఎంతో కఠినంగా సాగింది. యుక్త వయసులోనే మేమందరం యూరోప్‌కు వచ్చి శిక్షణ తీసుకుంటున్నాం’ అని ఇండోర్‌కు చెందిన 21 ఏళ్ల సుదీప్తి వ్యాఖ్యానించింది. ‘మేమందరం ఒకరినొకరం ఉత్సాహపరుచుకున్నాం. జాతీయ గీతం వినిపిస్తూ, జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే ఆ అనుభూతిని వర్ణించలేం.

మా అందరి శ్రమకు తగ్గ ఫలితం స్వర్ణం రూపంలో లభించింది’ అని 2017లో యూరోప్‌ వెళ్లిన కోల్‌కతాకు చెందిన 23 ఏళ్ల అనూష్‌ తెలిపాడు. జైపూర్‌కు చెందిన దివ్యాకృతి అజ్మీర్‌లోని విఖ్యాత మాయో గర్ల్స్‌ స్కూల్‌లో ఏడో తరగతిలో ఉన్నపుడు హార్స్‌ రైడింగ్‌పై దృష్టి సారించింది. 2020లో యూరోప్‌కు వెళ్లిన దివ్యాకృతి జర్మనీలో శిక్షణ తీసుకుంది. ముంబైకి చెందిన 25 ఏళ్ల విపుల్‌ గత పదేళ్లుగా యూరోప్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. లండన్‌ యూనివర్సిటీ నుంచి అతను బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ పూర్తి చేశాడు.

డ్రెసాజ్‌ అంటే.. 
ఈక్వెస్ట్రియన్‌లో ఎండ్యూరన్స్, ఈవెంటింగ్, జంపింగ్, పెగ్గింగ్, డ్రెసాజ్‌ తదితర ఈవెంట్లు ఉంటాయి. డ్రెసాజ్‌ అనేది ఫ్రెంచ్‌ పదం. ఆంగ్లంలో దీని అర్ధం ట్రెయినింగ్‌. తన అశ్వానికి రైడర్‌ ఏ విధంగా శిక్షణ ఇచ్చాడో, వీరిద్దరి మధ్య సమన్వయం ఎలా ఉందో ఈ ఈవెంట్‌ ద్వారా తెలుస్తుంది. రైడర్‌ నుంచి వచ్చే సంజ్ఞల ఆధారంగా అశ్వం కనబరిచే పలు కదలికలను జడ్జిలు పరిశీలిస్తారు. అనంతరం సున్నా నుంచి పది మధ్య పాయింట్లు ఇస్తారు. గరిష్టంగా పాయింట్లు సాధించిన జట్టుకు పతకాలు ఖరారవుతాయి. జట్టులో నలుగురు రైడర్లు ఉన్నా.. పతకాలు ఖరారు చేసేందుకు టాప్‌–3 రైడర్ల పాయింట్లను లెక్కలోకి తీసుకుంటారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)