Breaking News

జ్యోతి యర్రాజీకి స్వర్ణం

Published on Fri, 05/10/2024 - 04:22

సెర్టోహన్‌బాష్‌ (నెదర్లాండ్స్‌): కొత్త సీజన్‌ను భారత స్టార్‌ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో ప్రారంభించింది. గురువారం జరిగిన హ్యారీ షుల్టింగ్‌ గేమ్స్‌లో బరిలోకి దిగిన జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. హ్యారీ షుల్టింగ్‌ గేమ్స్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో ‘ఇ’ కేటగిరీ కిందికి వస్తాయి. 

100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును విశాఖపట్నంకు చెందిన జ్యోతి 12.87 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆమె కెరీర్‌లో ఇది నాలుగో అత్యుత్తమ సమయం. మిరా గ్రూట్‌ (నెదర్లాండ్స్‌; 13.67 సెకన్లు) రెండో స్థానంలో, హనా వాన్‌ బాస్ట్‌ (నెదర్లాండ్స్‌; 13.84 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణ సమయాన్ని (12.77 సెకన్లు) జ్యోతి ఇంకా అందుకోకపోయినా ర్యాంకింగ్స్‌ ప్రకారం జ్యోతికి ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారు కానుంది. 

ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో జ్యోతి 26వ స్థానంలో ఉంది. మొత్తం 40 మంది ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఇందులో 25 మంది అర్హత ప్రమాణ సమయం ఆధారంగా... మరో 15 మంది వరల్డ్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా అర్హత సాధిస్తారు.   

#

Tags : 1

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు