Breaking News

పసిడి ‘దీక్ష’

Published on Fri, 11/21/2025 - 03:33

టోక్యో: భారత బధిర క్రీడాకారిణి దీక్షా డాగర్‌ డెఫిలింపిక్స్‌లో టైటిల్‌ నిలబెట్టుకుంది.  బధిరుల విశ్వక్రీడల్లో గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే గోల్ఫ్‌ ఫైనల్లో ఆమె వరుసగా 68, 65, 72 స్కోర్లతో విజేతగా నిలిచింది. ఫైనల్లో మొత్తం 21 మంది తలపడగా భారత ప్లేయరే అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా 24 ఏళ్ల దీక్ష వరుస డెఫిలింపిక్స్‌ల్లో విజేతగా నిలిచిన గోల్ఫర్‌గా ఘనతకెక్కింది. 

నాలుగేళ్ల క్రితం 2021లో జరిగిన బధిర విశ్వక్రీడల్లోనూ ఆమె బంగారు పతకంతో మెరిసింది. అంతక్రితం 2017లో జరిగిన క్రీడల్లో ఆమె రజతం గెలుచుకుంది. పాల్గొన్న ప్రతి మెగా ఈవెంట్‌లోనూ ఆమె పతకంతోనే తిరిగొచ్చింది. జకార్తాలో 2018లో జరిగిన రెగ్యులర్‌ ఆసియా క్రీడల్లోనూ ఆమె పోటీ పడింది. 

ఆ మరుసటి ఏడాది (2019) మహిళల యూరోపియన్‌ టూర్‌లో 18 ఏళ్ల వయసులో టైటిల్‌ గెలిచింది. అదితి అశోక్‌ తర్వాత ఈ టైటిల్‌ గెలిచిన రెండో భారత గోల్ఫర్‌గా ఘనత వహించింది. ఈ పోటీల్లో భారత్‌ తరఫున ఆమెతో పాటు హర్‌‡్ష సింగ్, విభు త్యాగిలు కూడా పోటీపడినప్పటికీ వీళ్లిద్దరు వరుసగా 12వ, 14వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. 

మాహిత్‌ ‘ట్రిపుల్‌ ధమాకా’ 
భారత రైఫిల్‌ షూటర్‌ మాహిత్‌ సంధూ డెఫిలింపిక్స్‌లో ట్రిపుల్‌ ధమాకా సాధించింది. 50 మీటర్ల ప్రోన్‌ ఈవెంట్‌లో ఆమె 246.1 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఆమె 619.7 స్కోరుతో కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది. 

ఈ మెగా ఈవెంట్‌లో మాహిత్‌ 10 మీటర్ల మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం, 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గింది. ఆమె మూడు పతకాలతో ఒక్క షూటింగ్‌ క్రీడాంశంలోనే భారత్‌ డజను పతకాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం భారత్‌ 4 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో ఆరో స్థానంలో ఉంది. 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)