24 ఏళ్ల తర్వాత... ఇథోయోపియా అథ్లెట్‌కు పసడి పతకం

Published on Sun, 08/11/2024 - 04:14

పారిస్‌: ఒలింపిక్స్‌ క్రీడలు ముగియడానికి ఒక రోజు ముందు ఇథియోపియా జట్టు పసిడి పతకం బోణీ కొట్టింది. పురుషుల మారథాన్‌ ఈవెంట్‌లో తమిరాత్‌ తోలా విజేతగా నిలిచి ఇథియోపియాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన మారథాన్‌ రేసులో నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 32 ఏళ్ల తోలా అందరికంటే వేగంగా 2 గంటల 6 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

బషీర్‌ ఆబ్ది (బెల్జియం; 2గం:06ని:47 సెకన్లు) రజతం... బెన్సన్‌ కిప్రోతో (కెన్యా; 2గం:7ని:00 సెకన్లు) కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ పురుషుల మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్‌ స్వర్ణ పతకం సాధించడం విశేషం. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఇథియోపియా అథ్లెట్‌ గెజాహెగ్నె అబెరా మారథాన్‌ విజేతగా నిలిచాడు. 

మరోవైపు మారథాన్‌లో ‘హ్యాట్రిక్‌’ ఒలింపిక్‌ స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన కెన్యా దిగ్గజం ఎలూడ్‌ కిప్‌చోగే అనూహ్యంగా విఫలమయ్యాడు. 40 ఏళ్ల కిప్‌చోగే 30 కిలోమీటర్లు పరుగెత్తాక రేసు నుంచి వైదొలిగాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కిప్‌చోగే స్వర్ణ పతకాలు సాధించాడు. కిప్‌చోగే ‘పారిస్‌’లోనూ విజేతగా నిలిచిఉంటే ఒలింపిక్స్‌ మారథాన్‌ చరిత్రలో మూడు బంగారు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించేవాడు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)