Breaking News

ఒడిశాపై గోవా గెలుపు

Published on Fri, 02/07/2025 - 04:13

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) 2–1 స్కోరుతో ఒడిశా జట్టుపై విజయం సాధించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో గోవా తరఫున బ్రిసన్‌ డ్యూబెన్‌ ఫెర్నాండెజ్‌ 29వ నిమిషంలో గోల్‌ సాధించి గోవాకు తొలి ఆధిక్యం ఇచ్చాడు. ఒడిశా ఆటగాడు లాల్తతంగ ఖవిహ్‌రింగ్‌ (47వ నిమిషంలో) చేసిన సెల్ఫ్‌ గోల్‌ గోవా ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. 

54వ నిమిషంలో ఒడిశా స్ట్రయికర్‌ కేపీ రాహుల్‌ గోల్‌ చేసినప్పటికీ గోవా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఒడిశా తమ దాడులకు పదునుపెట్టలేకపోయింది. అవతలివైపు నుంచి గోవా ఎఫ్‌సీ ఆటగాళ్లు మాత్రం పదేపదే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకొచ్చి ఏకంగా 20 షాట్లు కొట్టారు. లక్ష్యంపై ఆరుసార్లు గురిపెట్టగా ఒకసారి గోల్‌తో విజయవంతమైంది. 

ఒడిశా 15 షాట్లు ఆడినా... కేవలం ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై రెండే సార్లు దాడి చేసింది. ఇందులో ఒకసారి మాత్రం ఫలితాన్ని సాధించింది. గోవా ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. బంతిని ప్రత్యర్థులకంటే తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అదేపనిగా చకచకా పాస్‌లు చేశారు. శుక్రవారం షిల్లాంగ్‌లో జరిగే పోరులో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ జట్టుతో ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడుతుంది.  
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు