Breaking News

గోవా ఘన విజయం

Published on Sun, 01/05/2025 - 04:19

భువనేశ్వర్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గోవా 4–2 గోల్స్‌ తేడాతో ఒడిశాను చిత్తుచేసింది. గోవా జట్టు తరఫున బ్రిసన్‌ ఫెర్నాండెస్‌ (8వ, 53వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో విజృంభించగా... ఉదాంత సింగ్‌ (45+2వ నిమిషంలో), అమెయ్‌ రణవాడె (56వ ని.లో) ఒక్కో గోల్‌ కొట్టారు. ఒడిశా తరఫున అహ్మద్‌ (29వ నిమిషంలో), జెరీ (88వ ని.లో) చెరో గోల్‌ చేశారు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై గోవా 7 షాట్స్‌ ఆడగా... ఒడిశా 5 షాట్లు కొట్టింది. 

తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన గోవా 7 ఇజయాలు, 2 పరాజయాలతు, 4 ‘డ్రా’లతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఒడిశా 14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 20 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో జంషెడ్‌పూర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ 2–1 గోల్స్‌ తేడాతో బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌పై గెలుపొందింది. 

జంషెడ్‌పూర్‌ తరఫున జోర్డన్‌ ముర్రే (84వ నిమిషంలో), మొహమ్మద్‌ ఉవైస్‌ (90వ నిమిషంలో) చెరో గోల్‌ సాధించగా... బెంగళూరు తరఫున అల్బెర్టో నొగురె (19వ నిమిషంలో) ఏకైక గోల్‌ సాధించాడు. మ్యాచ్‌ ఆరంభంలో దూకుడు కనబర్చిన బెంగళూరు 19వ నిమిషంలోనే గోల్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా మ్యాచ్‌ మరికాసేపట్లో ముగుస్తుందనగా జంషెడ్‌పూర్‌ వెంటవెంటనే రెండు గోల్స్‌ చేసి విజయం సాధించింది. 

ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన బెంగళూరు 8 విజయాలు 3 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతుండగా... జంషెడ్‌పూర్‌ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు 5 పరాజయాలతో 24 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో కేరళ బ్లాస్టర్స్‌ జట్టు తలపడుతుంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు