Breaking News

టీ20 బ్లాస్ట్‌ విజేత గ్లోసెస్టర్‌షైర్‌

Published on Sun, 09/15/2024 - 17:21

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌ 2024 ఎడిషన్‌ టైటిల్‌ను గ్లోసెస్టర్‌షైర్‌ గెలుచుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో గ్లోసెస్టర్‌షైర్‌ సోమర్‌సెట్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సోమర్‌సెట్‌ 19.4 ఓవర్లలో 124 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.

డేవిడ్‌ పేన్‌, మ్యాట్‌ టేలర్‌ తలో మూడు, జోష్‌ షా రెండు వికెట్లు తీసి సోమర్‌సెట్‌ను దెబ్బకొట్టారు. ఒలివర్‌ ప్రైస్‌, టామ్‌ ప్రైస్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. సోమర్‌సెట్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ లెవిస్‌ గ్రెగరీ ఒక్కడే అర్ద సెంచరీతో (53) రాణించాడు. కాడ్‌మోర్‌ (21), ఏబెల్‌ (19) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లోసెస్టర్‌షైర్‌.. 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి విజయతీరాలకు చేరింది. మైల్స్‌ హామండ్‌ (58 నాటౌట్‌), కెమరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ (53) తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించి గ్లోసెస్టర్‌షైర్‌ను గెలిపించారు. జోష్‌ డేవి, జేక్‌ బాల్‌లకు తలో వికెట్‌ దక్కింది. టీ20 బ్లాస్ట్‌ టైటిల్‌ను గెలవడం గ్లోసెస్టర్‌షైర్‌కు ఇది మొదటిసారి.

 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు