Breaking News

డేవిడ్‌ వీస్‌ ఆల్‌రౌండ్‌ షో

Published on Thu, 08/01/2024 - 16:26

గ్లోబల్‌ టీ20 కెనడా టోర్నీలో సర్రే జాగ్వర్స్‌పై బంగ్లా టైగర్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జాగ్వర్స్‌ 19.5 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. జాగ్వర్స్ జట్టులో విధ్వంసకర వీరులు ఉన్నా స్టోయినిస్‌ (36), వాన్‌ బీక్‌ (31) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కైల్‌ మేయర్స్‌ (5), సునీల్‌ నరైన్‌ (0), మన్సబ్‌ గిల్‌ (2), శ్రేయస్‌ మొవ్వ (0), బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (7), మొహమ్మద్‌ నబీ (0), తారిఖ్‌ (1), హర్మీత్‌ సింగ్‌ (0) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే ఔటయ్యారు. బంగ్లా టైగర్స్‌ బౌలర్లలో షొరీఫుల్‌ ఇస్లాం 3, డేవిడ్‌ వీస్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ చెరో 2, కర్టిస్‌ క్యాంఫర్‌, అలీ ఖాన్‌, డిల్లన్‌ హేలైగర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్‌.. 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బంతితో రాణించిన డేవిడ్‌ వీస్‌ బ్యాటింగ్‌లోనూ (19 బంతుల్లో 27 నాటౌట్‌)  సత్తా చాటి టైగర్స్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టైగర్స్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌ 4, ముహమ్మద్‌ వసీం 14, పర్గత్‌ సింగ్‌ 10, షకీబ్‌ అల్‌ హసన్‌ 1, ఇఫ్తికార్‌ అహ్మద్‌ 13, కర్టిస్‌ క్యాంఫర్‌ 10, డిల్లన్‌ హేలైగర్‌ 17 (నాటౌట్‌) పరుగులు చేశారు. జాగ్వర్స్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 3, స్టోయినిస్‌, లొగన్‌ వాన్‌ బీక్‌, బెన్‌ లిస్టర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో వాంకోవర్‌ నైట్స్‌పై బ్రాంప్టన్‌ వోల్వ్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వాంకోవర్‌ నైట్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. బ్రాంప్టన్‌ వోల్వ్స్‌ మరో 11 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వెబ్‌స్టర్‌ (49), నిక్‌ హాబ్సన్‌ (37) వోల్వ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)