Breaking News

గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ విజేత ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్‌

Published on Wed, 12/24/2025 - 04:11

ముంబై: ‘హ్యాట్రిక్‌’ సాధించాలని ఆశించిన త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ జట్టుకు చుక్కెదురైంది. టెక్‌ మహీంద్రా గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్‌ జట్టు కొత్త చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్‌ 2–0 (4–2; 4.5–1.5) పాయింట్ల తేడాతో తొలి రెండు ఎడిషన్స్‌లో టైటిల్‌ నెగ్గిన త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ జట్టును బోల్తా కొట్టించింది. 

ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్‌ జట్టులో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, లియోన్‌ ల్యూక్‌ మెండోంకా, కరువానా (అమెరికా), హు ఇఫాన్‌ (చైనా), అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌), నినో బతియాష్విలి (జార్జియా) సభ్యులుగా ఉన్నారు. తొలి ర్యాపిడ్‌ మ్యాచ్‌లో ఆల్పైన్ జట్టు 4–2తో త్రివేణి జట్టును ఓడించింది. రెండో ర్యాపిడ్‌ మ్యాచ్‌లో అల్పైన్‌ జట్టు 4.5–1.5తో త్రివేణి జట్టును మళ్లీ ఓడించి టైటిల్‌ను ఖరారు చేసుకుంది.

కాంటినెంటల్‌ కింగ్స్‌ జట్టులో అలీరెజా (ఫ్రాన్స్‌), వె యి (చైనా), విదిత్‌ (భారత్‌), జు జినెర్‌ (చైనా), కొస్టెనిక్‌ (స్విట్జర్లాండ్‌), మౌరిజి (ఫ్రాన్స్‌) సభ్యులుగా ఉన్నారు. మూడో స్థానం మ్యాచ్‌లో పీబీజీ అలాస్కన్‌ నైట్స్‌ 3–1 (2–4; 3.5–2.5; 3.5–2.5; 4–2)తో గ్యాంజెస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ జట్టుపై నెగ్గింది. పీబీజీ అలాస్కన్‌ నైట్స్‌ జట్టులో గుకేశ్‌ దొమ్మరాజు, అర్జున్‌ ఇరిగేశి (భారత్‌), కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్‌), సారా ఖాదెమ్‌ (స్పెయిన్‌), లెనియర్‌ (అమెరికా), డేనియల్‌ దర్దా (బెల్జియం) సభ్యులుగా ఉన్నారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)