Breaking News

మ్యాక్స్‌వెల్‌ కీలక నిర్ణయం

Published on Tue, 09/16/2025 - 19:11

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు చాలా ముందు నుంచే  అతను దేశవాలీ వన్డేలు (లిస్ట్‌-ఏ, 50 ఓవర్ల ఫార్మాట్‌) కూడా ఆడటం లేదు. తాజాగా మ్యాక్సీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.

దేశవాలీ వన్డే టోర్నీ డీన్‌ జోన్స్‌ ట్రోఫీ కోసం విక్టోరియా తరఫున బరిలోకి దిగనున్నాడు. మ్యాక్సీ 2022 తర్వాత ఒకే ఒక లిస్ట్‌-ఏ మ్యాచ్‌ ఆడాడు. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగుబోయే టీ20 సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్‌ సాధించేందుకు మ్యాక్సీ డీన్‌ జోన్స్‌ ట్రోఫీ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మ్యాక్సీ సెప్టెంబర్‌ 17న క్వీన్స్‌ల్యాండ్‌తో, సెప్టెంబర్‌ 19న టస్మానియాతో జరుగబోయే మ్యాచ్‌ల్లో ఆడతాడు.

మ్యాక్స్‌వెల్‌ జట్టులో (విక్టోరియా) మ్యాట్‌ షార్ట్‌, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌, మార్కస్‌ హ్యారిస్‌, విల్‌ సదర్‌ల్యాండ్‌ లాంటి పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. విక్టోరియా ఈ టోర్నీ గత సీజన్‌లో ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్‌ గెలవలేకపోయింది. మ్యాక్స్‌వెల్‌ లాంటి అనుభవజ్ఞుడు ఈ సీజన్‌లో విక్టోరియా తరఫున బరిలోకి దిగుతుండటం ఆ జట్టుకు మానసిక బలాన్ని చేకూరుస్తుంది.

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ఇటీవలికాలంలో వెస్టిండీస్‌, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లు ఆడింది. వీటిలో విండీస్‌ సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన ఆసీస్‌.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో దక్కించుకుంది. సౌతాఫ్రికా సిరీస్‌లోని నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (0/15 (2), 62* (36)) ఆకట్టుకుని, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.  

ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ పర్యటన అక్టోబర్‌ 1 నుంచి మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్‌ 3 టీ20లు ఆడుతుంది. అక్టోబర్‌ 1, 3, 4 తేదీల్లో మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా ఈ మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి