Breaking News

గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Published on Thu, 10/16/2025 - 12:08

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేతి గాయం నుంచి కోలుకుంటున్నాడు. టీమిండియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన.. ఆఖరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చేందుకు సన్నద్దమవుతున్నాడు.

అయితే గాయంతో జట్టుకు దూరంగా ఉన్న మ్యాక్సీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న స్ప్రింగ్ ఛాలెంజ్ టోర్నమెంట్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ ఉమెన్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. 

కోడ్ స్పోర్ట్స్ ప్రకారం.. మాక్స్‌వెల్ మెల్‌బోర్న్ స్టార్స్ హెడ్ కోచ్ ఆండీ క్రిస్టీతో కలిసి పనిచేయనున్నాడు. తన అనుభవాన్ని యువ మహిళా క్రికెటర్లకు పంచేందుకు అతడు సిద్దమయ్యాడు. అయితే మెల్‌బోర్న్ ఫ్రాంచైజీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

డబ్ల్యూబీబీఎల్ 2025-26 సీజన్ సన్నాహకంగా ఈ స్ప్రింగ్ ఛాలెంజ్ టోర్నీని నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం బీబీఎల్ జట్లతో పాటు ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ మహిళా క్రికెట్ టీమ్ పాల్గోనుంది. మెల్‌బోర్న్ స్టార్స్ ఉమెన్ తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా అక్టోబర్ 21న అడిలైడ్ స్ట్రైకర్స్‌తో తలపడనుంది. 

కాగా బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ మెన్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కోచ్‌గా సరికొత్త అవతారంలో మాక్స్‌వెల్‌ కన్పించనున్నాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో మాక్సీకి అద్బుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ విధ్వంసకర ఆటగాడు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. కాగా ఈ స్ప్రింగ్ ఛాలెంజ్ టోర్నీ అక్టోబర్‌ 31 వరకు జరగనుంది. ఆ తర్వాత మాక్స్‌వెల్‌ ఆసీస్‌ జట్టుతో కలవనున్నాడు.

భారత్‌తో తొలి రెండు టీ20లకు ఆసీస్ జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్,జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమన్, జోష్ ఫిలిప్‌, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మాథ్యూ కుహ్నమెన్‌

Videos

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

Photos

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)