Breaking News

పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్‌వెల్‌..

Published on Tue, 01/23/2024 - 09:01

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఓ వివాదంలో చికుకున్నాడు. జనవరి 19న ఆసీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రెట్ లీ స‌భ్యుడిగా ఉన్న ‘‘సిక్స్ అండ్ అవుట్’’ బ్యాండ్ అడిలైడ్‌లో ఓ కాన్స‌ర్ట్‌ను నిర్వ‌హించింది. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అనుమతి లేకుండానే మాక్స్‌వెల్ పాల్గోనున్నాడు. అంతేకాకుండా ఫుల్‌గా తాగి ఆసుపత్రి పాలయ్యాడు.

పీకల దాగా తాగిన మాక్స్‌వెల్ పబ్‌లోనే సోయలేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కాగా ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది. అయితే తాజాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల‌ సిరీస్‌కు ప్రకటించిన ఆసీస్‌ జట్టులో మాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. 

విండీస్‌తో టీ20ల దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇచ్చారు.  అంతే తప్ప అతడిని జట్టు నుంచి తప్పించడానికి పబ్‌ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు మాక్స్‌వెల్ కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే జట్టును ఫైనల్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో మెల్‌బోర్న్ కెప్టెన్సీ నుంచి మాక్సీ తప్పుకున్నాడు.
చదవండి: SA20 2024: జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే.. కట్‌చేస్తే.. 52 పరుగులకే ఆలౌట్‌!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)