Breaking News

ఎంత మోసమయ్యా మ్యాక్స్‌వెల్‌.. ఐపీఎల్‌లోనేమో అలా, ఎంఎల్‌సీలో ఇలా..!

Published on Thu, 06/19/2025 - 09:47

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో భాగంగా నిన్న (జూన్‌ 18) జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సుడిగాలి శతకంతో (49 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు) విరుచుకుపడ్డాడు. 

ఈ లీగ్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడంకు సారథ్యం వహిస్తున్న మ్యాక్సీ.. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.

ఈ ఇన్నింగ్స్‌ అనంతరం మ్యాక్సీ ఆటతీరుపై వాషింగ్టన్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. భారత క్రికెట్‌ అభిమానులకు మాత్రం రగిలిపోతున్నారు. మ్యాక్స్‌వెల్‌ తన సొంత దేశానికి (ఆస్ట్రేలియా) ఆడేటప్పుడు కాని, ఇతరత్రా లీగ్‌ల్లో ఆడేటప్పుడు కాని చెలరేగిపోతాడు. ఐపీఎల్‌కు వచ్చే సరికి మాత్రం తేలిపోతాడని మండిపడుతున్నారు. 

మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ ప్రదర్శనలను, ఇతర మ్యాచ్‌ల్లో ప్రదర్శనలతో పోలుస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లో లభించే భారీ మొత్తాన్ని దిగమింగుతూ, తనలోని అత్యుత్తమ ప్రదర్శనలను మాత్రం ఇతర లీగ్‌ల్లో ఇస్తాడంటూ చీవాట్లు పెడుతున్నారు. మ్యాక్సీ ఓ మోసగాడంటూ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. 

మ్యాక్స్‌వెల్‌ను ఐపీఎల్‌ 2025లో పంజాబ్‌ కింగ్స్‌ రూ. 4.2 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఈ మొత్తంలో కనిపించే సంఖ్యలకు సరిపడా పరుగులు కూడా చేయలేకపోయాడతను. మ్యాక్సీ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడి కేవలం​ 48 పరుగులు మాత్రమే చేశాడు. 

అదే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ విషయానికొస్తే.. ఈ అమెరికన్‌ లీగ్‌లో అతను ఇప్పటివరకు ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లోనే సెంచరీ సాయంతో 204 స్ట్రయిక్‌రేట్‌తో 149 పరుగులు చేశాడు. ఈ వ్యత్యాసాన్ని చూపించే భారత క్రికెట్‌ అభిమానులు మ్యాక్స్‌వెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి భారత క్రికెట్‌ అభిమానులు మ్యాక్సీ ఆటతీరుపై గత రెండేళ్లుగా గుర్రుగానే ఉన్నారు. 2024 ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాక్సీ ఆర్సీబీకి ఆడుతూ 10 మ్యాచ్‌ల్లో 52 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సీజన్‌లోనే భారత అభిమానులు అతనిపై తీవ్రస్థాయి ఆగ్రహ అందోళనలు వ్యక్తం చేశారు. 

ఆ సీజన్‌లో ఆర్సీబీ అతనికి రికార్డు స్థాయిలో రూ. 11 కోట్ల మొత్తం చెల్లించింది. ఇంత డబ్బు తీసుకొని కనీస న్యాయం చేయకపోవడం అతనికి కూడా ధర్మం కాదు. మ్యాక్సీ ఐపీఎల్‌లో ఆడేటప్పుడు చాలా ఉదాసీనంగా కనిపిస్తాడు. ఏదో హాలిడే ఎంజాయ్‌ చేసేందుకు వచ్చానన్నట్లు ఫీలవుతాడు. వరుస అవకాశాలు ఇచ్చినా సక్సెస్‌ కాకపోతే గాయం పేరు చెప్పి మధ్యలోనే ఇంటికి చెక్కేస్తాడు. గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో ఇదే జరిగింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)