Breaking News

రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ విజేత గ్లామోర్గన్‌

Published on Tue, 09/24/2024 - 07:32

రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ (ఇంగ్లండ్‌ దేశవాలీ వన్డే కప్‌) 2024 ఎడిషన్‌ విజేతగా గ్లామోర్గన్‌ జట్టు అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఆ జట్టు సోమర్‌సెట్‌పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా షెడ్యూల్డ్‌ తేదీన మ్యాచ్‌ రద్దు కాగా రిజర్వ్‌ డేలో నిర్వహించారు. ఈ రోజు కూడా వరుణుడు ఆటంకం కలిగించడంతో 20 ఓవర్స్‌ ఫార్మాట్‌లో మ్యాచ్‌ను జరిపారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గ్లామోర్గన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సామ్‌ నార్త్‌ఈస్ట్‌ అజేయ అర్ద సెంచరీతో (49 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బిల్లీ రూట్‌ (39), విలియమ్‌ స్మేల్‌ (28), వాన్‌ డెర్‌ గుగ్టెన్‌ (26 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సోమర్‌సెట్‌ బౌలర్లలో జార్జ్‌ థామస్‌, అల్ఫీ ఒగ్బోమ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్‌ గ్రీన్‌, అల్‌డ్రిడ్జ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సోమర్‌సెట్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. సోమర్‌సెట్‌ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ ఉమీద్‌ (45), సీన్‌ డిక్సన్‌ (44), ఆర్చీ వాన్‌ (32 నాటౌట్‌) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. 

గ్లామోర్గన్‌ బౌలర్లలో ఆండీ గార్విన్‌, బెన్‌ కాల్లావే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేనియల్‌ డౌట్‌వెయిట్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. రెండు నెలల పాటు సాగిన ఈ టోర్నీలో నిన్నటితో ముగిసింది. గ్లామోర్గన్‌ వన్డే కప్‌ టైటిల్‌ సాధించడం ఇది రెండో సారి. 2021 సీజన్‌లో ఈ జట్టు డర్హమ్‌పై విజయం సాధించి, తొలి టైటిల్‌ చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా లీసెస్టర్‌ఫైర్‌ ఉంది. 

చదవండి: రాణించిన గబ్బర్‌.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)