Breaking News

ఘనా ఐదోసారి...

Published on Tue, 10/14/2025 - 04:21

అక్రా: వచ్చే ఏడాది జరిగే పురుషుల ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు ఆఫ్రికా జోన్‌ నుంచి ఘనా జట్టు అర్హత సాధించింది. ఆఫ్రికాక్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్‌ ‘ఐ’ విజేత హోదాలో ఘనా జట్టుకు ప్రపంచకప్‌ బెర్త్‌ ఖరారైంది. కోమోరోస్‌ జట్టుతో ‘డ్రా’ చేసుకుంటే ప్రపంచకప్‌ బెర్త్‌ ఖాయమయ్యే పరిస్థితిలో ఘనా జట్టు 1–0 గోల్‌ తేడాతో గెలిచింది. 

ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌లో టోటెన్‌హమ్‌ జట్టుకు ఆడే మొహమ్మద్‌ కుడుస్‌ 47వ నిమిషంలో గోల్‌ చేసి ఘనా జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2026 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. ఇప్పటికి 19 జట్లు అర్హత పొందాయి. 

ఇందులో ఆతిథ్య దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో జట్లకు నేరుగా అర్హత దక్కింది. ఆఫ్రికా జోన్‌ నుంచి 9 జట్లకు అవకాశం ఉండగా... ఇప్పటికి ఐదు జట్లు (మొరాకో, ట్యూనిషియా, ఈజిప్‌్ట, అల్జీరియా, ఘనా) బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఐదోసారి ప్రపంచకప్‌ ఆడనున్న ఘనా జట్టు 2010లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది.    

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు