Breaking News

పిల్లలను కన్నాక ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ప్రముఖ ఫుట్‌బాలర్‌

Published on Tue, 08/12/2025 - 13:58

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాలర్‌, పోర్చుగీస్‌ లెజెండ్‌ క్రిస్టియానో రొనాల్డో తన దీర్ఘకాలిక ప్రేయసి జార్జినా రోడ్రిగ్జ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట ఎనిమిదేళ్ల ప్రేమ, ఐదుగురు పిల్లల పెంపకం తర్వాత తమ బంధాన్ని అధికారికం చేసింది. రొనాల్డోతో ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.

రొనాల్డో-జార్జినా ఇప్పటికే ఇద్దరు పిల్లలకు (అలానా మార్టినా (2017), బెల్లా ఎస్మెరాల్డా (2022)) తల్లిదండ్రులు. రొనాల్డోకు మరో ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. వీరిలో క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌ రొనాల్డో మొదటి భార్య కుమారుడు. క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌ తర్వాత రొనాల్డో సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలను కన్నాడు. 

ఎవా మారియా , మటేయో అనే వీరు 2017లో జన్మించారు. వీరి తర్వాత రొనాల్డో జార్జినాతో అలానా మార్టినా, బెల్లా ఎస్మెరాల్డా, ఆంజెల్‌ను కన్నాడు. అయితే బెల్లా ట్విన్ బ్రదర్ అయిన ఆంజెల్‌ జన్మ సమయంలోనే మరణించాడు.

రొనాల్డో-జార్జినా ప్రేమ కథ
రొనాల్డో-జార్జినా 2016లో మాడ్రిడ్‌లోని Gucci షాప్‌లో మొదటి సారి కలుసుకున్నారు.  2017 ఫిఫా అవార్డుల ప్రధానోత్సవంలో వీరిద్దరు మొదటిసారి పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చారు.  

జార్జినా రోడ్రిగ్జ్ (31, అర్జెంటీనా) ఓ ప్రముఖ మోడల్, ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఎంటర్‌టైనర్ మరియు వ్యవసాయదారురాలు. ఆమె జీవిత ప్రయాణం సాధారణ వెయిట్రెస్‌ ఉద్యోగంతో మొదలైంది. ఆమె నెట్‌ఫ్లిక్స్‌లో I Am Georgina అనే డాక్యుమెంటీతో బాగా పాపులరైంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)