సెమీస్‌లో గాయత్రి–ట్రెసా జోడీ

Published on Sat, 09/28/2024 - 04:23

మకావ్‌: వరుసగా ఐదు టోర్నమెంట్‌లలో క్వార్టర్‌ ఫైనల్‌ దాటి ముందుకెళ్లలేకపోయిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఆ అడ్డంకిని ఆరో ప్రయత్నంలో అధిగమించింది. మకావ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో మూడో సీడ్‌ గాయత్రి–ట్రెసా జాలీ జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–12, 21–17తో ఆరో సీడ్‌ సు యిన్‌ హుయ్‌–లోన్‌ జి యున్‌ (చైనీస్‌ తైపీ) జంటపై గెలిచింది. 

గత జూన్‌లో సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన తర్వాత గాయత్రి–ట్రెసా ఐదు టోర్నీలు ఆడారు. అయితే ఈ ఐదు టోర్నీల్లో వారు క్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగాడు. ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 16–21, 12–21తో ఓడిపోయాడు. 

నేడు జరిగే మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సెయి పె షాన్‌–హుంగ్‌ ఎన్‌ జు (చైనీస్‌ తైపీ)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. గతవారం చైనా ఓపెన్‌ టోర్నీ తొలి రౌండ్‌లోనే సెయి పె షాన్‌–హుంగ్‌ ఎన్‌ జు చేతిలో ఓడిన గాయత్రి–ట్రెసా ఈసారి గెలిచి బదులు తీర్చుకుంటారో లేదో వేచి చూడాలి.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)