Breaking News

గౌతమ్‌ గంభీర్‌పై వేటు..?

Published on Sun, 01/05/2025 - 17:15

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా తొమ్మిదేళ్ల ఆధిపత్యానికి తెర పడింది. బీజీటీ 2024-25ని భారత్‌ 1-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (జనవరి 5) ముగిసిన చివరి టెస్ట్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి టెస్ట్‌ ఓటమితో భారత్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి కూడా ఎలిమినేట్‌ అయ్యింది. భారత్‌ తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది.

డబ్ల్యూటీసీ ఓటమి నేపథ్యంలో పలువురు సీనియర్‌ ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మెడపై కత్తి వేలాడుతుంది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ను తక్షణమే తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గంభీర్‌ ఓ చెత్త కోచ్‌ అని భారత క్రికెట్‌ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గంభీర్‌ వచ్చి టీమిండియాను నాశనం చేశాడని వారంటున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన గంభీర్‌.. చెత్త వ్యూహాలతో టీమిండియాను భ్రష్ఠుపట్టించాడని అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వరుస వైఫల్యాలకు గంభీరే పరోక్ష కారణమని మండిపడుతున్నారు.

కాగా, గంభీర్‌ రాక​ ముందు టీమిండియా ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండింది. రాహుల్‌ ద్రవిడ్‌ ఆథ్వర్యంలో భారత్‌ 2024 టీ20 వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచింది. ఆ వెంటనే గంభీర్‌ ద్రవిడ్‌ నుంచి కోచింగ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా టీమిండియా తొలి సిరీస్‌లో గెలిచింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0 క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక్కడి నుంచి గంభీర్‌ వైఫల్యాలకు బీజం పడింది. గంభీర్‌ ఆథ్వర్యంలో భారత్‌ రెండో సిరీస్‌నే కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ 0-2 తేడాతో కోల్పోయింది.

ఆతర్వాత భారత్‌ బంగ్లాదేశ్‌పై టెస్ట్‌, టీ20 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. అనంతరం టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో ఇంత చిత్తుగా ఓడటం భారత్‌కు ఇదే మొదటిసారి. కివీస్‌ చేతిలో ఘోర పరాభవాన్ని మరిచిపోయేలోపే భారత్‌ బీజీటీలో బొక్కబోర్లా పడింది. బీజీటీలో తొలి టెస్ట్‌ గెలిచిన టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుని మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది.

ఇదిలా ఉంటే, సిడ్నీ టెస్ట్‌లో భారత్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్‌ పంత్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లలో స్కాట్‌ బోలాండ్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్‌స్టర్‌ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు.

నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్‌ పంత్‌ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్‌ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా 41, ట్రవిస్‌ హెడ్‌ 34, బ్యూ వెబ్‌స్టర్‌ 39 పరుగులు చేశారు. 
 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)