Breaking News

రాజీనామా డిమాండ్ల మధ్య 'గంభీర'మైన పోస్ట్

Published on Mon, 07/27/2026 - 18:33

టీమిండియా హెడ్‌ కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇటీవల భారత జట్టు వరుస సిరీస్‌ల్లో నిరాశపరిచిన తర్వాత కొందరు అభిమానులు గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొందరు నెటిజన్లు దానిని గంభీర్ పరిస్థితితో పోలుస్తూ మీమ్స్‌ను వైరల్ చేశారు.

ఈ పరిస్థితి మధ్య గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో "Jab desh ka sabse Gambhir insaan muskura de…" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో కూడిన పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను ఆయనపై వస్తున్న విమర్శలకు పరోక్ష సమాధానంగా పలువురు అభిమానులు భావిస్తున్నారు. అయితే గంభీర్ మాత్రం తన పోస్టులో ఎక్కడా రాజీనామా డిమాండ్లు లేదా విమర్శలను ప్రస్తావించలేదు.

గంభీర్‌ మార్గదర్శకత్వంలోని భారత జట్టు ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 0-2తో, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 0-4తో, వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వరుస పరాజయాల తర్వాత గంభీర్‌పై విమర్శలు తారాస్థాయికి చేరాయి.

మరోవైపు, గంభీర్ విశ్రాంతిలో ఉండగా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా జట్టుతో కలిసి జింబాబ్వే పర్యటనకు వెళ్లాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు అక్కడ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో, లక్ష్మణ్‌ను శాశ్వత ప్రధాన కోచ్‌గా నియమించాలనే డిమాండ్లు తీవ్రమయ్యాయి.

అయితే గంభీర్ కోచ్‌గా ఉన్న కాలంలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న విషయాన్ని కూడా అభిమానులు గుర్తుంచుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఆయన పదవిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)