Breaking News

వారిద్దరు లేకపోవడం లోటే కానీ...

Published on Sat, 05/24/2025 - 07:38

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌కు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించడం వారి వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో ఇతరుల పాత్ర ఏమీ లేదని భారత జట్టు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. వారిద్దరు లేకపోవడం జట్టుకు లోటే అయినా...వారి స్థానాల్లో వచ్చే ఆటగాళ్లకు ఇది మంచి అవకాశమని అతను అన్నాడు. 

‘ఒక ఆటగాడు కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు తన ఇష్ట ప్రకారమే ముగింపు కూడా ఇవ్వాలనుకుంటాడు. అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. కోచ్, సెలక్టర్‌ లేదా దేశంలో ఎవరికి కూడా అతడు ఎప్పుడు రిటైర్‌ కావాలో ఎప్పుడు రిటైర్‌ కాకూడదో చెప్పే హక్కు లేదు. కాబట్టి వారిది తమ స్వంత నిర్ణయంగానే భావించాలి. ఈ ఇద్దరు అనుభవజు్ఞలు లేకపోవడం కొంత వరకు కష్టమే. 

అయితే ఇతర ప్లేయర్లకు ఇది చాలా మంచి అవకాశం. నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా వారు బాధ్యత తీసుకోవాలి. చాంపియన్స్‌ ట్రోఫీకి బుమ్రా దూరమైనప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఇతర బౌలర్లు సత్తా చాటి జట్టును గెలిపించారు కదా. ఈసారి కూడా ఎంతో మంది తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. కోహ్లి, రోహిత్‌ 2027 వన్డే వరల్డ్‌ కప్‌ ఆడే విషయంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని, అందుకు చాలా సమయం ఉందని భారత కోచ్‌ స్పష్టం చేశాడు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)