Breaking News

ఫ్యామిలీ ఎమ‌ర్జెన్సీ.. భార‌త్‌కు తిరిగొచ్చిన గౌతం గంభీర్‌

Published on Fri, 06/13/2025 - 15:40

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మ‌రో వారం రోజుల‌లో ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదిక‌గా జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై అడుగుపెట్టిన భార‌త జ‌ట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. 

నేటి నుంచి భార‌త సీనియ‌ర్ టీమ్‌-ఇండియా 'ఎ' జ‌ట్ల మ‌ధ్య వార్మాప్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఫ్యామిలీ ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా తిరిగి భార‌త్‌కు వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది. రెవ్‌స్పోర్ట్స్ రిపోర్ట్ ప్ర‌కారం.. గంభీర్ త‌ల్లికి గుండెపోటు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం.

ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం ప్ర‌స్తుతం ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, ఐసీయూలో చికిత్స అందిస్తున్న‌ట్లుగా స‌ద‌రు రిపోర్ట్ పేర్కొంది. ఈ క్ర‌మంలోనే గంభీర్ హుటాహుటిన స్వ‌దేశానికి వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే గంభీర్ తిరిగి ఎప్పుడు ఇంగ్లండ్‌కు వెళ్తాడ‌న్నది ఇంకా క్లారిటీ లేదు. తొలి టెస్టుకు  ప్రారంభానికి ముందే జ‌ట్టుతో గంభీర్ తిరిగి కలిసే అవ‌కాశ‌ముంది. కాగా వైట్‌బాల్ సిరీస్‌ల‌లో కోచ్‌గా విజ‌య‌వంత‌మైన‌ గౌతీ.. టెస్టుల్లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఇంకా త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. 

అత‌డి నేతృత్వంలో భారత జట్టు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోర పరాభావాలను మూటకట్టుకుంది. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ గంభీర్‌కు చాలా కీలకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ ఆటగాళ్లు లేని యువ భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై ఎలా రాణిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కొత్త టెస్టు జట్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.
చదవండి: న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మహోగ్రరూపం.. 19 సిక్సర్లతో ఊచకోత
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)