Breaking News

టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు నేను రెడీ: గంభీర్‌

Published on Sun, 06/02/2024 - 20:36

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌ పదవిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. మే 27తో ద‌ర‌ఖాస్తు గ‌డువు తేదీ ముగిసినా ఎవ‌రెవ‌రు పోటీలో ఉన్నారు? అనే విష‌యంపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే భారత హెడ్‌కోచ్‌ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 

అయితే మరి కొన్ని రిపోర్ట్‌లు మాత్రం గంభీర్‌కు హెడ్‌కోచ్‌ పదవిపై ఆసక్తి లేదని పేర్కొంటున్నాయి. కాగా గంభీర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా పనిచేస్తున్నాడు. ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌ను ఛాంపియన్స్‌గా నిలిపిన తర్వాత గంభీర్‌ వరుస కార్యక్రమాలతో బీజీబీజీగా ఉన్నాడు. 

ఈ క్రమంలో అబుదాబిలోని మెడియర్ ఆసుపత్రిలో విద్యార్థులతో గౌతీ ఇంటరాక్టయ్యాడు. ఈ నేపథ్యంలో భారత హెడ్‌కోచ్‌ పదవిపై తన అభిప్రాయాలను చెప్పమని గౌతీని విద్యార్థులు ప్రశ్నించారు. జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. 

"భారత జట్టు హెడ్‌కోచ్‌ పనిచేసేందుకు నేను ఇష్టపడతాను. జాతీయ జట్టుకు కోచ్ చేయడం కంటే గొప్ప గౌరవం ఇంకొకటి ఉండదు. మేము దేశంలో ఉన్న 140 కోట్ల భారతీయుల తరపున ఆడుతాము. అంతకంటే అదృష్టం ఇంకేమి ఉంటుందని" గంభీర్‌ పేర్కొన్నాడు.
చదవండి: T20 WC: సునీల్‌ గవాస్కర్‌ను కలిసిన బాబర్‌ ఆజం.. వీడియో వైరల్‌
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)