Breaking News

గౌతమ్‌ గంభీర్‌కు చుక్కెదురు

Published on Wed, 08/27/2025 - 16:40

కోవిడ్ మందుల అక్రమ నిల్వల కేసులో టీమిండియా హెడ్‌ కోచ్‌, మాజీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు చర్యలపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలన్న గంభీర్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి నీనా బన్సల్ కృష్ణా ఆగస్టు 29న విచారించేందుకు అంగీకరించినప్పటికీ, తక్షణ ఉపశమనం మాత్రం ఇవ్వలేదు.

విచారణ సందర్భంగా గంభీర్ తరఫు న్యాయవాదులు ఆయన సేవా కార్యక్రమాలు, క్రికెట్‌లో అతని కీర్తి, ఎంపీగా చేసిన సేవలు వంటి అంశాలను ప్రస్తావించగా, న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. పేరు చెప్పి కోర్టును ప్రభావితం చేయరాదని మందలించారు.

ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 8న ట్రయల్ కోర్టు విచారణ ఉన్నందున, ఆదివారం (ఆగస్టు 29)లోపు ఉపశమనం ఇవ్వాలని గంభీర్‌ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే హైకోర్టు తక్షణమే స్టే ఇవ్వకుండా, కేసును విచారించేందుకు మాత్రమే అంగీకరించింది.

కాగా, 2021 కోవిడ్‌ సెకండ్ వేవ్ సమయంలో గౌతమ్‌ గంభీర్, అతని ఫౌండేషన్‌ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసి పంపిణీ చేసిందని ఢిల్లీ డ్రగ్ కంట్రోల్ శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి గంభీర్ తరఫు న్యాయవాదులు నాలుగేళ్లుగా వాదనలు వినిపిస్తున్నారు.

కోవిడ్‌ సమయంలో ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను ప్రజల సహాయార్థం పంపిణీ చేశారని, సేవా కార్యక్రమాలకు లైసెన్సుల అవసరం లేదని గంభీర్‌ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ఈ వాదనలతో కోర్టులు ఏకీభవించడం లేదు. ఏ ఉద్దేశంతో చేసినా ఔషధాల నిల్వ, పంపిణీ విషయంలో చట్టపరమైన నియమాలు తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)