Breaking News

భారత కెప్టెన్‌గా అతడి స్థాయిని ఎవరూ అందుకోలేరు: గంభీర్‌

Published on Mon, 04/08/2024 - 15:35

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు కెప్టెన్‌గా ధోని సాధించిన ఘనతలను అందుకోవడం ఇక ముందు ఎవరికీ సాధ్యం కాదనడంలో సందేహం లేదన్నాడు.

టీమిండియా కెప్టెన్‌గా ఎవరెన్ని విజయాలు సాధించినా ధోని మూడు ఐసీసీ ట్రోఫీల ముందు దిగదుడుపేనని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌)- చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) మధ్య సోమవారం మ్యాచ్‌ జరుగనుంది.

ఈ నేపథ్యంలో కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత మెంటార్‌ గౌతం గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కేతో పోరును తాను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు మెంటార్‌గా ఇందులో ఎటువంటి మార్పులేదన్నాడు. సీఎస్‌కేపై పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపాడు.

ఇక ధోని గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘నేను ఈ మ్యాచ్‌ గెలవాలనే కోరుకుంటున్నాను. నేనే కాదు.. నా స్థానంలో ధోని ఉన్నా తన జట్టే గెలవాలని కోరుకుంటాడు.

స్నేహితులుగా ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంది. అంతమాత్రాన పోటీ పడటంలో ఎవరూ తగ్గరు కదా!.. ఏదేమైనా టీమిండియా కెప్టెన్‌గా ధోని మాదిరి మరెవరూ విజయవంతం కాలేదన్నది నిజం.

మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం మామూలు విషయం కాదు. కొంతమంది భారత కెప్టెన్లు విదేశాల్లో చారిత్రక విజయాలు సాధించవచ్చు.. మరికొందరు టెస్టు మ్యాచ్‌లలో గెలిపించవచ్చు. అయినా మూడు ఐసీసీ ట్రోఫీల కంటే అవేమీ పెద్దవి కావు’’ అని గంభీర్‌.. ధోని నాయకత్వ నైపుణ్యాలను కొనియాడాడు.

కాగా ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌కప్‌-2007, వన్డే ప్రపంచకప్‌-2011 గెలిచిన భారత జట్టులో గంభీర్‌ సభ్యుడన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్‌ ఫైనల్లో 75, వన్డే ఫార్మాట్‌ ఫైనల్లో 97 పరుగులు చేసి ఈ ట్రోఫీలు గెలవడంలో గంభీర్‌ కీలక పాత్ర పోషించాడు. 

అయితే, ఎల్లప్పుడూ ధోనిని ఏదో రకంగా విమర్శించే ఈ కేకేఆర్‌ మెంటార్‌ ఈసారి ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. కాగా కేకేఆర్‌ సారథిగా సీఎస్‌కేతో 11సార్లు పోటీపడ్డ గంభీర్‌ ఐదుసార్లు గెలిచాడు. 2012 ఫైనల్లో సీఎస్‌కేను ఓడించి టైటిల్‌ గెలిచాడు కూడా!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)