Breaking News

ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్‌

Published on Wed, 06/19/2024 - 04:18

న్యూఢిల్లీ: భారత మాజీ ఓపెనర్లు గౌతమ్‌ గంభీర్, డబ్ల్యూవీ రామన్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి కోసం క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్న హెడ్‌ కోచ్, బ్యాటింగ్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం గత ఏడాది నవంబర్‌లో ముగిసింది. 

అయితే అమెరికా, వెస్టిండీస్‌లలో జరుగుతున్న టి20 ప్రపంచకప్‌ కోసం ద్రవిడ్‌కు తాత్కాలిక పొడిగింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌ కోసం ఇదివరకే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్వేషణ మొదలుపెట్టింది. నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, స్రూ్కటినీ పూర్తయ్యాక చివరకు మిగిలిన ఇద్దరు గంభీర్, రామన్‌లలో గౌతీనే ఖాయం చేద్దామని బోర్డు సుముఖంగా ఉంది. 

అయితే తుది ఇంటర్వ్యూ ముగించాకే సీఏసీ సిఫార్సు మేరకు నిర్ణయం వెలువరించాలనే యోచనలో బీసీసీఐ ఉంది. మంగళవారం సీఏసీ హెడ్‌ అశోక్‌ మల్హోత్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో గంభీర్, రామన్‌లు తమ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సుమారు 40 నిమిషాల పాటు టీమిండియా కోసం వచ్చే మూడేళ్లపాటు తన అనుభవాన్ని ఎలా వెచి్చస్తాననేది, పూర్తిస్థాయిలో ఏమేరకు అందుబాటులో ఉంటాననేది గంభీర్‌ తెలిపాడు.  

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)