Breaking News

మళ్లీ డిష్యూం డిష్యూం.. కోహ్లి, గంభీర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్‌

Published on Tue, 05/02/2023 - 07:28

ఐపీఎల్‌-2023లో భాగంగా వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు తేడాతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 108 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, కరణ్‌ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా మ్యాక్స్‌వెల్‌, హసరంగా, సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌ తలా వికెట్‌ సాధించారు.

గంభీర్‌, కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం
ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌, ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవను ఇది గుర్తుకు తెచ్చింది. అయితే ఇందులో నేరుగా గంభీర్‌ పాత్ర లేకపోయినా...అతని జోక్యంతో పరిస్థితి కాస్త వేడిగా మారింది. బెంగళూరు విజయం తర్వాత షేక్‌ హ్యాండ్‌ల సమయంలో కోహ్లి, లక్నో పేసర్‌ నవీనుల్‌ హఖ్‌ (అఫ్గానిస్తాన్‌) మధ్య ఏదో వాదన జరిగింది. చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరూ విడిపించుకున్నారు.

అయితే ఆ తర్వాత నవీన్‌ను పిలిచి కోహ్లి ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముందుగా కైల్‌ మేయర్స్‌ (వెస్టిండీస్‌), ఆ తర్వాత గంభీర్‌ తమ ఆటగాడికి అండగా నిలుస్తూ మధ్యలోకి వచ్చారు. దాంతో కోహ్లి, గంభీర్‌ తీవ్రంగా వాదించుకున్నారు. చివరకు రాహుల్, మిశ్రా జోక్యం చేసుకొని విడిపించాల్సి వచ్చింది.

ఆ తర్వాతా కోహ్లి పదే పదే ఇదే విషయాన్ని రాహుల్‌కు ఫిర్యాదు చేయడం కనిపించింది. నిజానికి గత మ్యాచ్‌లో గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో నోరు మూయమంటూ ప్రేక్షకులను ఉద్దేశించి గంభీర్‌ సైగ చేయగా...ఈసారి గెలుపు బాటలో కోహ్లి అదే తరహాలో సైగ చేస్తూ దానిని గుర్తు చేయడం కూడా ఒక కారణం కావచ్చు! ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి
చదవండి: LSG VS RCB: టాప్‌-3లోకి చేరిన అమిత్‌ మిశ్రా.. ఒకేసారి ముగ్గురిని అధిగమించి..!

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు