Breaking News

డానిల్‌ మెద్వెదెవ్‌కు షాక్‌.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్‌'

Published on Wed, 05/31/2023 - 07:15

పారిస్‌: రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌కు ‘ఫ్రెంచ్‌’ మరోసారి అచ్చిరాలేదు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ రష్యన్‌ తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. యూఎస్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌  మెద్వెదెవ్‌ క్లేకోర్టులో ఐదోసారి మొదటి రౌండ్లోనే కంగుతిన్నాడు. వరుసగా నాలుగేళ్లు అతను తొలిరౌండ్‌ అడ్డంకి దాటలేకపోయాడు.

తాజాగా మెద్వెదెవ్‌ 6–7 (5/7), 7–6 (8/6), 6–2, 3–6, 4–6తో క్వాలిఫయర్‌ సెబొత్‌ వైల్డ్‌ (బ్రెజిల్‌) చేతిలో కంగుతిన్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో పురుషుల నాలుగో సీడ్‌ కాస్పెర్‌ రూడ్‌ (నార్వే) 6–4, 6–3, 6–2తో క్వాలిఫయర్‌ ఎలియస్‌ వైమెర్‌ (స్వీడెన్‌)పై గెలుపొందగా... 22వ సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) తొలిరౌండ్‌ అడ్డంకిని  దాటేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఈ జర్మన్‌ ప్లేయర్‌ 7–6 (8/6), 7–6 (7/0), 6–1తో హ్యారిస్‌ (దక్షిణాఫ్రికా)పై చెమటోడ్చి నెగ్గాడు.  

స్వియాటెక్‌ శుభారంభం..
డిఫెండింగ్‌ చాంపియన్, టాప్‌సీడ్‌ ఇగా స్వియాటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్లో పోలండ్‌ స్టార్‌ 6–4, 6–0తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్‌)పై అలవోక విజయం సాధించింది. వరుస సెట్లలో కేవలం గంటా 13 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది.

మిగతా మ్యాచ్‌ల్లో ఆరో సీడ్‌ కొకొ గాఫ్‌ (అమెరికా) 3–6, 6–1, 6–2తో రెబెక మసరొవా (స్పెయిన్‌)పై, ఏడో సీడ్‌ ఓన్స్‌ జాబెర్‌ (ట్యూనిషియా ) 6–4, 6–1తో లూసియా బ్రాంజెటి (ఇటలీ)పై, నాలుగో సీడ్‌ ఎలీనా రిబాకిన (కజకిస్తాన్‌) 6–4, 6–2తో క్వాలిఫయర్‌ లిండా ఫ్రువిర్టొవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందారు. వైల్డ్‌కార్డ్‌ ప్లేయర్‌ డియన్‌ ప్యారీ (ఫ్రాన్స్‌) 6–2, 6–3తో 25వ సీడ్‌ అన్హెలినా కలినినా (ఉక్రెయిన్‌)కు వరుస సెట్లలో షాకిచ్చింది.

చదవండి: 'అది మేము కాదు.. మా ఫోటోలను మార్ఫింగ్‌ చేశారు!'

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)