భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ

Published on Sat, 07/13/2024 - 13:55

మహిళల టీ20 ఆసియా కప్-2024కు శ్రీలంక ఆతిథ్యమివ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. జూలై 19న దంబుల్లా వేదిక‌గా  యూఏఈ - నేపాల్ మ‌హిళ‌ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు క్రికెట్ అభిమానుల‌కు శ్రీలంక క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది.

టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లకు  ప్రేక్షకులకు  ఫ్రీ ఎంట్రీ ఇవ్వాల‌ని శ్రీలంక క్రికెట్ నిర్ణ‌యించింది. "మహిళల ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నంద‌కు చాలా సంతోషంగా ఉంది. మహిళల క్రికెట్ ఆద‌ర‌ణ పెంచేందుకు అభిమానుల‌కు ఉచిత ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నామ‌ని  శ్రీలంక క్రికెట్  వైస్ ప్రెసిడెంట్ రవిన్ విక్రమరత్నే తెలిపారు. ఈయ‌నే ఆసియాక‌ప్‌  టోర్నమెంట్ డైరెక్టర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

ఇక ఆసియా సింహాల పోరులో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌లో జూలై 19న దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానుల ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇప్పుడు శ్రీలంక క్రికెట్ ఉచిత ప్ర‌వేశం క‌ల్పించ‌డంతో పెద్ద ఎత్తున ఇరు జ‌ట్ల ఫ్యాన్స్ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు త‌ర‌లి రానున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో భారత్‌, పాకిస్తాన్‌, యూఏఈ, నేపాల్ ఉండగా.. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌,మలేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. ఇక​ ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఆసియాకప్‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీప‌ర్‌), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్
రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)