Breaking News

ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌- ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌.. వారికి ఫ్రీ ఎంట్రీ

Published on Sat, 01/20/2024 - 18:32

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. జనవరి 25 నుంచి 29 వరకు ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ అధ్యక్షుడు జగన్మోహన రావు తెలిపారు. 

శనివారం విలేకరుల సమావేశంలో జగన్మోహన రావు మాట్లాడుతూ.. మేము ఎన్నికైన తర్వాత జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌ కోసం భారీ ఏర్పాట్లు చేశాం.  మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు రోజుకు 5 వేల మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాం.

అయితే మ్యాచ్ కి ముందే స్కూల్ నుంచి లెటర్ హెచ్‌సీఏకు పంపించాల్సి ఉంటుంది. హెచ్‌సీఏకు పాఠశాల నుంచి లెటర్‌ అందితే టిక్కెట్లను నేరుగా వారివద్దకే పంపిస్తాం. ఒక స్కూల్ కి ఒకరోజు మాత్రమే అవకాశం కల్పిస్తాం. అదే విధంగా విద్యార్థులకు ఫ్రీ గా ఫుడ్ కూడా అందిస్తామని పేర్కొన్నారు.

ఆర్మీ జవాన్లకు ఫ్రీ ఎంట్రీ..
అదే విధంగా ఈ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్‌లకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మ్యాచ్‌కు అనుమతిస్తామని జగన్మోహన రావు వెల్లడించారు. ఆసక్తి గల వారు ఈ నెల 18వ తేదీలోపు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్‌సీఏ సీఈవోకు మెయిల్‌ చేయాలని ఆయన చెప్చుకొచ్చారు.

కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 26వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి జింఖానా మైదానంలో ఫిజికల్‌ టిక్కెట్లను హెసీఏ విక్రయించనుంది.
చదవండి: పాకిస్తాన్‌ క్రికెట్‌కు భారీ షాక్‌.. దేశాన్ని వీడనున్న స్టార్‌ ఆటగాడు!?

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)