Breaking News

వెస్టిండీస్‌కు భారీ షాక్‌.. ఒకేసారి రిటైర్మెంట్‌ ప్రకటించిన నలుగురు క్రికెటర్లు

Published on Fri, 01/19/2024 - 13:26

వెస్టిండీస్‌ క్రికెట్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టుకు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్‌ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆఫ్‌ స్పిన్నర్‌  అనిసా మొహమ్మద్‌, ​మీడియం పేసర్‌ షకీరా సెల్మన్‌, కవలలైన వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కైసియ నైట్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌ కైషోనా నైట్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ నలుగురు విండీస్‌ టీ20 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌లోని (2016) సభ్యులు. అనుభవజ్ఞులైన ఈ నలుగురు ఒకేసారి రిటైర్మెంట్‌ ప్రకటించడంతో విండీస్‌ మహిళల క్రికెట్‌ జట్టు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఈ నలుగురు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయాన్ని విండీస్‌ క్రికెట్‌ బోర్డు దృవీకరించింది.

  • 35 ఏళ్ల అనిసా మొహమ్మద్‌ (ఆఫ్‌ స్పిన్నర్‌) 2003-22 మధ్యలో విండీస్‌ తరఫున 141 వన్డేలు, 117 టీ20లు ఆడి 305 వికెట్లు పడగొట్టింది. ఇందులో తొమ్మిది ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. 
  • 34 ఏళ్ల షకీరా సెల్మన్‌ (మీడియం పేసర్‌) 2008-22 మధ్యలో విండీస్‌ తరఫున 100 వన్డేలు, 96 టీ20లు ఆడి 133 వికెట్లు తీసి,310 పరుగులు చేసింది. షకీరా వన్డేల్లో ఓసారి ఐదు వికెట్ల ఘనత నమోదు చేసింది. 
  • 31 ఏళ్ల కైషోనా నైట్‌ (లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌) 2013-22 మధ్యలో విండీస్‌ తరఫున 51 వన్డేలు, 55 టీ20లు ఆడి ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 1397 పరుగులు చేసి, ఓ వికెట్‌ తీసింది. 
  • 31 ఏళ్ల కైసియ నైట్‌ (వికెట్‌కీపర్‌ బ్యాటర్‌) 2011-22 మధ్యలో 87 వన్డేలు, 70 టీ20లు ఆడి నాలుగు హాఫ్‌ సెంచరీల సాయంతో 2128 పరుగులు చేసి 78 మందిని ఔట్‌ చేయడంలో భాగమైంది. 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)