Breaking News

‘పసిడి’ పోరుకు జైస్మీన్, నుపుర్‌

Published on Sat, 09/13/2025 - 03:52

లివర్‌పూల్‌: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళా బాక్సర్లు నాలుగు పతకాలు ఖరారు చేసుకొని భారత్‌ పరువును నిలబెట్టారు. 57 కేజీల విభాగంలో జైస్మీన్‌ లంబోరియా, ప్లస్‌ 80 కేజీల విభాగంలో నుపుర్‌ షెరాన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకాలకు విజయం దూరంలో నిలిచారు. 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 80 కేజీల విభాగంలో ఇప్పటికే పూజా రాణి సెమీఫైనల్‌ చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. 

శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం సెమీఫైనల్లో జైస్మీన్‌ 5–0తో అల్కాలా కరోలినా (వెనిజులా) ఘనవిజయం సాధించింది. ఫైనల్లో జూలియా జెరెమిటా (పోలాండ్‌)తో జైస్మీన్‌ తలపడుతుంది. అల్కాలాతో జరిగిన బౌట్‌లో జైస్మీన్‌ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. మూడు రౌండ్లలోనూ భారత బాక్సరే పైచేయి సాధించింది. ప్లస్‌ 80 కేజీల విభాగం సెమీఫైనల్లో నుపుర్‌ 5–0తో సేమా దుజ్‌టాస్‌ (టర్కీ)పై గెలుపొందింది. 

48 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో మీనాక్షి 5–0తో అలైస్‌ పంఫేరి (ఇంగ్లండ్‌)పై నెగ్గింది. నేడు జరిగే సెమీఫైనల్లో లుట్‌సైఖాన్‌ (మంగోలియా)తో మీనాక్షి తలపడుతుంది.  మరోవైపు పురుషుల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. 12 ఏళ్ల తర్వాత భారత పురుష బాక్సర్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. 

బరిలో మిగిలిన చివరి బాక్సర్‌ జాదూమణి సింగ్‌ (50 కేజీలు) కూడా ఓడిపోయాడు. క్వార్టర్‌ ఫైనల్లో జాదూమణి సింగ్‌ 0–4తో వరల్డ్‌ చాంపియన్‌ సంజార్‌ తషె్కన్‌బె (కజకిస్తాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు కాంస్యాలు లభించాయి.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)