Breaking News

సంచలనం.. మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌కు బిగ్‌షాక్‌

Published on Tue, 01/17/2023 - 12:03

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో సంచలనం నమోదైంది. స్పెయిన్‌ క్రీడాకారిణి.. మాజీ వరల్డ్‌ నెంబర్‌వన్‌ గార్బిన్‌ ముగురజా తొలిరౌండ్‌లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ముగురజా.. బెల్జియంకు చెందిన 26వ సీడ్‌ ఎలిస్‌మార్టెన్స్‌ చేతిలో 3-6, 7-6(3), 6-1 తేడాతో ఓటమి పాలైంది.

తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న ముగురజా రెండో సెట్‌లో మాత్రం తడబడింది. ఎలిస్‌ మార్టెన్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో మార్టెన్‌ విజయం సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడోసెట్‌లో మాజీ నెంబర్‌వన్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 1-6 తేడాతో ఎలిస్‌ మార్టెన్‌ సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. 

ఇక ముగురజా గతంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌తో పాటు వింబుల్డన్‌ను గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను దక్కించుకుంది. ఇక 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో రన్నరప్‌గా నిలిచింది.

ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే.. నాలుగో సీడ్‌ కరోలిన్‌ గార్సియా కెనడాకు చెందిన అన్‌సీడెడ్‌ కాథరిన్‌ సెబోవ్‌పై 6-3, 6-0తో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇక సొంతగడ్డపై ఫెవరెట్‌గా కింబర్లీ బిర్రెల్‌.. 31వ సీడ్‌ కాయా కనేపిని 7-6(4), 6-1తో ఓడించి రెండోరౌండ్‌లో అడుగుపెట్టింది. ఇక పురుషుల సింగిల్స్‌ విభాగంలో డొమినిక్‌ థీమ్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ చేతిలో 6-3, 6-4,6-2 తేడాతో వరుస సెట్లలో ఖంగుతిన్నాడు. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు