Breaking News

లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌

Published on Sun, 03/10/2024 - 15:41

టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ రానున్న లోక్‌సభ​ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. పఠాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నాడు. వెస్ట్‌ బెంగాల్‌లోని బరంపూర్‌ నియోజకవర్గం నుంచి యూసఫ్‌ పఠాన్‌ను టీఎంసీ బరిలోకి దించింది. ఇవాళ ఉదయమే తృణమూల్‌ తీర్దం పుచ్చుకున్న పఠాన్‌... పార్టీలో చేరిన గంటలోపే ఎంపీ టికెట్‌ దక్కించుకోవడం ఆసక్తికరం. 

ప్రస్తుతం బరంపూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ లోక్‌సభ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ ఎంపీగా ఉన్నాడు. చౌదరీ గతంలో ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి​ పొత్తులో భాగంగా బరంపూర్‌ స్థానాన్ని టీఎంసీ కాంగ్రెస్‌కు వదిలి పెడుతుందని అంతా అనుకున్నారు.

అయితే కాంగ్రెస్‌కు షాక్‌ ఇస్తూ టీఎంసీ రాష్ట్రం మొత్తంలో అభ్యర్దులను నిలబెట్టింది. ఇవాళ ఉదయం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 42 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించింది. సీట్ల సర్దుబాటులో విషయంలో కాంగ్రెస్‌-టీఎంసీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ పశ్చిమ బెంగాల్‌ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని గత కొద్ది రోజుల నుంచి భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరో టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తాడని సమాచారం​. యువీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి  బరిలో నిలుస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. 

కాగా, భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్బనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ రాజ్యసభ​ ఎంపీగా (ఆమ్‌ ఆద్మీ పార్టీ) కొనసాగుతున్నాడు.

లోక్‌సభ​ విషయానికొస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్‌సభ​కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇతను 2019లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందాడు. అయితే గంభీర్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని ప్రచారం​ జరుగుతున్న యువరాజ్‌ సింగ్‌.. ప్రస్తుత ఎంపీలు గంభీర్‌, హర్బజన్‌ సింగ్ సమకాలీకులే కావడం విశేషం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)