Breaking News

'ఇంత చెత్త‌గా ఆడుతార‌ని ఊహించలేదు.. నన్ను క్ష‌మించండి'

Published on Wed, 02/26/2025 - 11:26

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య‌ పాకిస్తాన్ ప్ర‌యాణం ముగిసిన సంగ‌తి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌.. టోర్నీ ప్రారంభ‌మైన కేవ‌లం ఆరు రోజుల్లోనే ఇంటిముఖం ప‌ట్టింది. దీంతో ఈ మెగా టోర్నీకి ముందు తాము చేసిన వ్యాఖ్య‌ల‌ను పాక్ మాజీ ఆట‌గాళ్లు వెనక్కి తీసుకుంటున్నారు. 

తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ బ్యాట‌ర్ బ‌సిత్ అలీ చేరాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌కు పాకిస్తాన్ చేరుతుంద‌ని, తుది పోరు లాహోర్ వేదిక‌గా జ‌రుగుతుంద‌ని అలీ అంచ‌నా వేశాడు. అయితే పాక్ లీగ్ స్టేజిలోనే నిష్క్ర‌మించిడంతో తాజాగా అలీ క్షమాపణలు చెప్పాడు. భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గాల‌ని త‌ను కోరుకుంటున్న‌ట్లు అత‌డు తెలిపాడు.

"ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ లాహెర్ వేదిక‌గా జ‌రుగుతుంద‌ని, పాక్ టైటిల్ పోరుకు ఆర్హ‌త సాధిస్తుంద‌ని చెప్పినందుకు న‌న్ను క్ష‌మించిండి. ఈ టోర్నీలో పాకిస్తాన్ టీమ్ ఇంత చెత్త‌గా ఆడుతుంద‌ని నేను అస్స‌లు ఊహించ‌లేదు. ఈ మెగా ఈవెంట్‌లో భార‌త్ త‌మ అధిప‌త్యాన్ని కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నాను. మ‌ర్చి 9న దుబాయ్ వేదిక‌గా ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా, భార‌త్‌లు త‌ల‌ప‌డితే బాగుంటుంది. మ‌రోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌ను త‌ల‌పిస్తుందని అనుకుంటున్నాను" అని అలీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.

బై బై అకీబ్‌..!
ఇక ఈ ఘోర ప్ర‌ద‌ర్శ‌న నేప‌థ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త‌మ జ‌ట్టు తాత్కాలిక హెడ్ కోచ్  అకిబ్‌ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిని తొలిగించాల‌ని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న అకిబ్ ప‌ద‌వీ కాలం ఈ నెల 27తో ముగియ‌నుంది.

ఈ టోర్నీ ముగిసిన అనంత‌రం పాకిస్తాన్ జ‌ట్టు వైట్‌బాల్ సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు న్యూజిలాండ్‌కు వెళ్ల‌నుంది. దీంతో న్యూజిలాండ్ టూర్‌కు ముందు పాక్‌కు కొత్త హెడ్‌కోచ్ అవకాశ‌ముంద‌ని పీసీబీ మూలాలు వెల్ల‌డించాయి. పాక్ త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్ర‌వరి 27న బంగ్లాదేశ్‌తో రావ‌ల్పిండి వేదిక‌గా త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: మీ కంటే కోతులు బెట‌ర్‌.. త‌క్కువ‌గా తింటాయి: వసీం అక్రమ్‌
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)