Breaking News

పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గ‌జం.. !?

Published on Tue, 03/26/2024 - 17:36

పాకిస్తాన్ పురుష‌ల క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆట‌గాడు ల్యూక్ రోంచి బాధ్య‌త‌లు చేప‌ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అత‌డితో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు సమాచారం. రోంచి కూడా పీసీబీ ఆఫ‌ర్‌పై ఆస‌క్తిగా ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. రోంచి ప్ర‌స్తుతం న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా ప‌నిచేస్తున్నాడు. ఒక‌వేళ పీసీబీ ఆఫ‌ర్‌ను అత‌డు అంగీక‌రిస్తే న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్ ప‌దవి నుంచి త‌ప్పుకోనున్నాడు.

కాగా వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్‌ దశలోనే ఇంటి బాట పట్టిన త‌ర్వాత పాకిస్తాన్ క్రికెట్‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. బాబ‌ర్ ఆజం పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోగా.. హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్  సైతం త‌న ప‌దవికి రాజీనామా చేశాడు. ఈ క్ర‌మంలో  గత డిసెంబర్‌, జనవరిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల కోసం మహమ్మద్‌ హఫీజ్‌ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు.

అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ జ‌ట్టు స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌కు ముందు త‌మ జ‌ట్టు హెడ్‌కోచ్ ప‌ద‌విని భ‌ర్తీ చేసే ప‌నిలో పీసీబీ ప‌డింది.  ఇప్ప‌టికే ఆసీస్ దిగ్గ‌జం షేన్ వాట్స‌న్‌, విండీస్ మాజీ కెప్టెన్ డార‌న్ సామిని హెడ్‌కోచ్ ప‌దవి కోసం పీసీబీ సంప్ర‌దించింది. కానీ పీసీబీ ఆఫ‌ర్‌ను వారిద్ద‌రూ రిజ‌క్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా  ల్యూక్ రోంచితో పీసీబీ చ‌ర్చ‌లు జ‌ర‌పుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)