Breaking News

చిక్కుల్లో సురేశ్‌ రైనా.. ఈడీ నోటీసులు

Published on Wed, 08/13/2025 - 11:01

టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా చిక్కుల్లో చిక్కుకున్నాడు. అక్రమ బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో అతనికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) నోటీసులు పంపింది. ఇవాళ అతను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

1xBet అనే అక్రమ బెట్టింగ్‌ యాప్‌కు ప్రమోషన్ చేశాడని రైనాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్‌ గాంబ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద రైనాపై విచారణ జరుగనుంది. అక్రమ యాప్ ప్రకటనల్లో  రైనా కనిపించినట్లు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి.

ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే గూగుల్‌, మెటా సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది. 1xBet తరహాలోనే గ్యాంబ్లింగ్‌కు పాల్పడే పలు యాప్స్‌పై కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా 27,000 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు అంచనా. ఇలాంటి కేసుల్లోనే సినీ సెలబ్రిటీలు విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌, రానా దగ్గుబాటి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే, సురేశ్‌ రైనా టీమిండియా, ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న తర్వాత వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. త్వరలో అతను సీఎస్‌కేకు బ్యాటింగ్‌ కోచ్‌గా వెళ్లనున్నాడని సమాచారం. రైనాకు టీమిండియా తరఫున ఆడిన దానికంటే ఐపీఎల్‌ ద్వారా విశేషమైన గుర్తింపు దక్కింది. 

ఐపీఎల్‌లో విశేషంగా రాణించడం ద్వారా అతన్ని మిస్టర్‌ ఐపీఎల్‌గా కీర్తిస్తారు. ఐపీఎల్‌లో రైనా 2008 నుంచి 2021 వరకు సీఎస్‌కే తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సీఎస్‌కే సాధించిన 4 ఐపీఎల్‌ టైటిళ్లలో రైనా కీలకపాత్ర పోషించాడు. 
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు