Breaking News

County Championship: 126 ఏళ్ల రికార్డు బద్దలు

Published on Tue, 07/01/2025 - 15:21

కౌంటీ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌, సర్రే ఆటగాడు డామినిక్‌ సిబ్లీ ట్రిపుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌-1లో భాగంగా డర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిబ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో సిబ్లీ 475 బంతులు ఎదుర్కొని 29 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 305 పరుగులు చేశాడు. సిబ్లీకి కెరీర్‌లో ఇదే మొదటి ట్రిపుల్‌ సెంచరీ.

ఇదే ఇన్నింగ్స్‌లో మరో ముగ్గురు సర్రే ఆటగాళ్లు కూడా సెంచరీలు చేశారు. ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఆడే సామ్‌ కర్రన్‌ (124 బంతుల్లో 108; 14 ఫోర్లు, సిక్స్‌), ముంబై ఇండియన్స్‌కు ఆడే విల్‌ జాక్స్‌ (94 బంతుల్లో 119; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకాలు బాదారు. మరో ఇంగ్లండ్‌ జాతీయ జట్టు ఆటగాడు డాన్‌ లారెన్స్‌ (149 బంతుల్లో 178; 19 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగాడు.

సర్రే ఇన్నింగ్స్‌లో ఓ హాఫ్‌ సెంచరీ కూడా నమోదైంది. ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు మాజీ ఆటగాడు రోరి బర్న్స్‌ 74 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఓ ట్రిపుల్‌ సెంచరీ, 3 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ నమోదు కావడంతో సర్రే రికార్డు బ్రేకింగ్‌ స్కోర్‌ చేసింది. 

ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 820 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆ క్లబ్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌. 1899లో సోమర్‌సెట్‌పై చేసిన 811 పరుగుల స్కోర్‌ ఈ మ్యాచ్‌కు ముందు వరకు సర్రే అత్యధిక స్కోర్‌గా ఉండింది. ఈ మ్యాచ్‌లో సర్రే 126 రికార్డును బద్దలు కొట్టింది. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన డర్హమ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. ఎమిలియో గే 7 పరుగులు చేసి ఔట్‌ కాగా.. ఆలెక్స్‌ లీస్‌ (33), విల్‌ రోడ్స్‌ (16) క్రీజ్‌లో ఉన్నారు. డర్హడ్‌ సర్రే తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 761 పరుగులు వెనుకపడి ఉంది. 

కౌంటీ క్రికెట్‌ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్‌
ఈ మ్యాచ్‌లో సర్రే చేసిన స్కోర్‌ కౌంటీ క్రికెట్‌ చరిత్రలోనే నాలుగో అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డైంది. కౌంటీల్లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు యార్క్‌షైర్‌ పేరిట ఉంది. 1896లో ఆ జట్టు వార్విక్‌షైర్‌పై 887 పరుగులు చేసింది. రెండో అత్యధిక స్కోర్‌ లాంకాషైర్‌ (863), మూడో అత్యధిక స్కోర్‌ సోమర్‌సెట్‌ (850/7) పేరిట ఉన్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)