Breaking News

బెంగళూరు బోణీ

Published on Sun, 09/07/2025 - 02:51

విశాఖ స్పోర్ట్స్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–12)లో మాజీ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 38–30తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. పీకేఎల్‌లో అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలిచిన పట్నా పరాజయాల పరంపరలో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. పైరేట్స్‌ ఆడిన మూడు ఓడగా... నాలుగో మ్యాచ్‌లో బుల్స్‌ తొలి విజయాన్ని సాధించింది. బెంగళూరు జట్టులో ఆల్‌రౌండర్‌ అలీరెజా మిర్జాయిన్‌ (10), రెయిడర్‌ ఆశిష్‌ మాలిక్‌ (8)  అదరగొట్టారు. 

డిఫెండర్లు దీపక్‌ శంకర్‌ (4), యోగేశ్‌ (3), సత్యప్ప, సంజయ్‌ చెరో 2 పాయింట్లు చేశారు. పట్నా పైరేట్స్‌ జట్టులో రెయిడర్‌ అయాన్‌ (10) ఒంటరి పోరాటం చేశాడు. 15 సార్లు కూతకెళ్లిన అయాన్‌ పది పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతావారిలో సుధాకర్‌ (6), అంకిత్‌ కుమార్‌ (4) మెరుగ్గా ఆడారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయంట్స్‌ 37–28తో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది. 

గుజరాత్‌ జట్టులో ఆల్‌రౌండర్లు నితిన్‌ పన్వార్‌ (8), మొహమ్మద్‌ రెజా (6) రాణించారు. రెయిడర్లు రాకేశ్‌ 6, హిమాన్షు సింగ్‌ 4 పాయింట్లు సాధించారు. తలైవాస్‌ జట్టులో కెపె్టన్‌ పవన్‌ సెహ్రావత్‌ (6), నితీశ్‌ కుమార్‌ (5), అర్జున్‌ దేశ్వాల్‌ (5) ఆకట్టుకున్నారు. నేడు ఆదివారం జరిగే మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్, దబంగ్‌ ఢిల్లీతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడనున్నాయి.  

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)