Breaking News

అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి.. శాంసన్‌ కంటే బెటర్‌!

Published on Sun, 05/07/2023 - 18:26

ఐపీఎల్‌-2023లో అదరగొడుతున్న పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేష్‌ శర్మపై భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి ప్రశంసల వర్షం కురిపించాడు. భారత అత్యుత్తమ వికెట్‌ కీపర్లలో జితేష్‌ శర్మ ఒకడని సునీల్ జోషి కొనియాడాడు. కాగా జితేష్‌ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

ముఖ్యంగా ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి పంజాబ్‌ జట్టుకు అద్భుతమైన ఫినిషర్‌గా మారాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన జితేష్‌ 165.97 స్ట్రైక్ రేట్‌తో​239 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో హిందూస్తాన్‌ టైమ్స్‌తో జోషి మాట్లాడుతూ.. "ఐపీఎల్‌లో జితేష్‌ దుమ్మురేపుతున్నాడు. పంజాబ్‌కు మంచి ఫినిషింగ్‌ ఇస్తున్నాడు. కాబట్టి సంజూ శాంసన్‌ స్ధానంలో జితేష్‌ శర్మను భారత జట్టుకు ఎంపిక చేయాలి. సంజూ కంటే  జితేష్‌ శర్మ మెరుగైన ఆటగాడు.

గత కొన్ని నెలలగా అతడు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు కచ్చితంగా టీమిండియాకు ఆడాలి. గత కొన్ని టీ20 సిరీస్‌లకు జితేష్‌ భారత జట్టులో భాగమయ్యాడు. కానీ అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.ఈ సారి మాత్రం అతడికి తుది జట్టులో ఛాన్స్‌ ఇవ్వండి. అతడు పంజాబ్‌కు ఏమి చేస్తున్నాడో టీమిండియాకు కూడా అదే అందిస్తాడు" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన పాండ్యా బ్రదర్స్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)