Breaking News

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ కన్నుమూత

Published on Wed, 04/23/2025 - 11:12

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ కీత్‌ స్టాక్‌పోల్‌ (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను గుండెపోటుతో మరణించారని తెలుస్తుంది. కీత్‌కు 60వ దశకంలో మంచి బ్యాటర్‌గా పేరుంది. 

లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన కీత్‌ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్‌లు, 6 వన్డేలు ఆడి 7 సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీలు చేశాడు.

1966లో ఇంగ్లండ్‌పై మిడిలార్డర్‌ బ్యాటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన కీత్‌.. 1969లో ఓపెనర్‌గా మారాడు. ఆ సమయంలో అతను బిల్‌ లారీతో కలిసి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేవాడు. 

కీత్‌కు ఇంగ్లండ్‌పై మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 1972 యాషెస్‌ సిరీస్‌లో అతను 53.88 సగటున 3 సెంచరీల సాయంతో 485 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

కీత్‌ తన కెరీర్‌ బెస్ట్‌ స్కోర్‌ 207 పరుగులను కూడా ఇంగ్లండ్‌పైనే చేశాడు. కీత్‌ 1973లో విజ్డెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. కీత్‌ మృతి పట్ల క్రికెట్‌ ఆస్ట్రేలియా చైర్మన్‌ మైక్‌ బెయిర్డ్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

దేశవాలీ క్రికెట్‌లో విక్టోరియాకు ప్రాతినిథ్యం వహించిన కీత్‌.. ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 10100 పరుగులు చేసి 148 వికెట్లు పడగొట్టాడు. కీత్‌ రిటైర్మెంట్‌ (1974) తర్వాత టీవీ మరియు రేడియో వ్యాఖ్యాతగా కూడా పని చేశారు. 

కీత్‌ చాలామంది ఆసీస్‌ ప్లేయర్లకు మెంటార్‌గా కూడా పని చేశాడు. కీత్‌.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొట్టమొదటి వన్డేలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో అతను 3 వికెట్లు తీశాడు.

 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)