Breaking News

ప్రపంచకప్‌లో గిల్‌ తప్పక రాణిస్తాడు.. ఎందుకంటే: ఆసీస్‌ మాజీ ప్లేయర్‌

Published on Sat, 08/19/2023 - 19:33

World Cup 2023 - Shubman Gill: వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీలో టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తప్పక రాణిస్తాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ గ్రెగ్‌ చాపెల్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ రైట్‌ హ్యాండర్‌కు మెరుగైన రికార్డు ఉందన్న విషయాన్ని గుర్తు చేశాడు. సొంతగడ్డపై గిల్‌ తప్పక బ్యాట్‌ ఝులిపిస్తాడని జోస్యం చెప్పాడు. 

విండీస్‌ పర్యటనలో విఫలం
కాగా వెస్టిండీస్‌ పర్యటనలో శుబ్‌మన్‌ గిల్‌ స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమైన విషయం తెలిసిందే. టెస్టుల్లో ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్‌ రాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ పంజాబీ బ్యాటర్‌ తేలిపోయాడు. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ ఉసూరుమనిపించాడు.

అయితే, మూడో వన్డేలో 85 పరుగులతో రాణించినప్పటికీ.. టీ20 సిరీస్‌లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. నాలుగో టీ20లో 77 పరుగులు మినహా మిగతా నాలుగు మ్యాచ్‌లలో సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో అహ్మదాబాద్‌ పిచ్‌పై మాత్రమే గిల్‌ ఆడతాడంటూ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇక ఆసియా వన్డే కప్‌, వన్డే ప్రపంచకప్‌ రూపంలో కీలక టోర్నీలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో శుబ్‌మన్‌ గిల్‌ నిలకడలేని ఫామ్‌ ఆందోళనకరంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో గ్రెగ్‌ చాపెల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

తప్పక రాణిస్తాడు.. ఎందుకంటే
‘‘ఈ ఫార్మాట్లో(వన్డే) అతడికి మంచి రికార్డు ఉంది. కాబట్టి మెగా ఈవెంట్లో అతడు తప్పక రాణిస్తాడని నమ్ముతున్నా. గతంలో తన రికార్డులను పరిశీలిస్తే అతడి ఆట తీరు ఎలా ఉందో మనకు తెలుస్తుంది. తనకు కేవలం టెస్టు క్రికెట్‌లోనే సమస్యలు ఎదురవుతున్నాయి. వన్డేల్లో మాత్రం అతడి ప్రదర్శనలు మెరుగ్గానే ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు. 

ఇక బౌలర్లు కొత్త బంతితో బరిలోకి దిగినపుడు గిల్‌ ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌.. ఈ యువ బ్యాటర్‌కు సూచించాడు. కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 వన్డేలు ఆడిన శుబ్‌మన్‌ గిల్‌.. 1437 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా నాలుగు సెంచరీలు, ఒక ద్విశతకం ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్‌ మాత్రం: పాక్‌ దిగ్గజం 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)