Breaking News

‘ఫిఫా’ వరల్డ్‌కప్‌ సరి‘కొత్త’గా...

Published on Thu, 06/04/2026 - 03:32

విశ్వవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉన్న ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోరుకు సమయం ఆసన్నమైంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ‘ఫిఫా’ వరల్డ్‌కప్‌ మరో ఏడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పలు విప్లవాత్మక మార్పులు చేసేందుకు ‘ఫిఫా’ సిద్ధమైంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ బోర్డు (ఐఎప్‌ఏబీ)తో కలిసి మెరుగైన నిబంధనలను రూపొందించింది. గతంలో మాదిరిగా ప్లేయర్లు సమయాన్ని వృథా చేయడానికి వీలు లేకుండా... ఆటలో మరింత పోటీతత్వం పెంచేందుకు ఈ నిబంధనలు ఉపకరించనున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...  – సాక్షి, క్రీడావిభాగం 

» బంతి మైదానం వెలుపలికి వెళ్తే... దాన్ని తిరిగి 5 సెకన్ల లోపు గ్రౌండ్‌లోకి తేవాల్సి ఉంటుంది. ఏ ఆటగాడైనా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తే... దానికి బదులుగా ప్రత్యర్థి జట్టుకు ‘త్రో ఇన్‌’ అవకాశం ఇవ్వనున్నారు. గతంలో ఆటగాళ్లు తమ ప్లేయర్లు ఎక్కడ ఉన్నారో చూసుకొని బంతిని త్రో చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు.  

» ‘గోల్‌ కిక్‌’ల సమయాన్ని కూడా 5 సెకన్లకు పరిమితం చేశారు. కావాలని సమయాన్ని వృథా చేస్తే ప్రత్యర్థి జట్టుకు కార్నర్‌ కిక్‌ లభిస్తుంది.  

»  ఎవరైనా ఆటగాడు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాలంటే డిజిటల్‌ డిస్‌ప్లేపై ప్రదర్శించిన 10 సెకన్లలోపు ఒక ప్లేయర్‌ మైదానాన్ని వీడి అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడు రావాలి. సమయాన్ని పాటించని జట్టు ఒక నిమిషం పాటు 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి ఉంటుంది.  

»  ప్లేయర్లు చికిత్స నిమిత్తం మైదానాన్ని వీడితే...  తిరిగి గ్రౌండ్‌లోకి రావడానికి ముందు ఒక నిమిషం పాటు బయటే ఉండాలి. తీవ్రమైన గాయాల విషయంలో ఇందులో సడలింపులు ఇవ్వనున్నారు.  

»   మైదానంలో ప్లేయర్లు తమ నోటిని చేత్తో మూయడం గానీ అడ్డంగా ఎలాంటి వస్తువులు పెట్టుకోవడం గానీ చేయరాదు. ఇది కేవలం వరల్డ్‌కప్‌లో మాత్రమే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యాచ్‌లలో అమలు చేయనున్నారు. జాత్యహంకారాన్ని అరికట్టేందుకు ‘ఫిఫా’ ఈ నిబంధన తీసుకొచ్చింది. దీన్ని అతిక్రమిస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా ‘రెడ్‌ కార్డ్‌’ చూపిస్తారు. 

»  మ్యాచ్‌కు రెండు చొప్పున ‘హైడ్రేషన్‌’ విరామాలు లభించనున్నాయి. 3 నిమిషాల ఈ బ్రేక్స్‌ను ఆట ఆరంభమైన 20 నిమిషాల తర్వాత తీసుకోవచ్చు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)