Breaking News

రూ.1750 నుంచి రూ.13,500 వరకు...

Published on Sat, 11/29/2025 - 03:22

సాక్షి, హైదరాబాద్‌: ఫుట్‌బాల్‌ దిగ్గజం, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ప్రత్యక్షంగా ఈ స్టార్‌ ప్లేయర్‌ ఆటను చూసే అవకాశం నగర అభిమానులకు కలుగుతోంది. ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’లో భాగంగా డిసెంబర్‌ 13న మెస్సీ హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ షో నిర్వహిస్తారు. 

దేశవ్యాప్తంగా నాలుగు దిక్కుల్లో నాలుగు నగరాలు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అతని పర్యటన ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా ప్రైవేట్‌ కార్యక్రమాలు. ప్రముఖ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ శతధ్రు దత్తా ఈ టూర్‌ మొత్తానికి నిర్వాహకుడు. నాలుగు వేదికల్లో అభిమానుల కోసం నిర్వహిస్తున్న ఈవెంట్లు కాకుండా ముంబైలో వ్యక్తిగతంగా మెస్సీని కలిసి ఫోటో దిగే అవకాశం కూడా నిర్వాహకులు కల్పిస్తున్నారు. అయితే దీని కోసం ఒక్కొక్కరు సుమారు రూ.9.95 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది! 

స్టేడియంలో కార్యక్రమం ఇదీ... 
సాయంత్రం 7 గంటలకు మొదలై దాదాపు 3 గంటల పాటు మెస్సీ ‘షో’ సాగుతుంది. ఇందులో నాలుగు అంశాలు ఉన్నాయి. ఎంపిక చేసిన సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌... ఎంపిక చేసిన చిన్నారులతో ‘మాస్టర్‌ క్లాస్‌ విత్‌ యంగ్‌ టాలెంట్స్‌’... ‘పెనాల్టీ షూటౌట్‌’లో మెస్సీ పాల్గొంటాడు. ఆ తర్వాత మ్యూజికల్‌ కన్‌సర్ట్‌ ఉంటుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు టికెట్ల వివరాలను ప్రకటించారు. 

ఇందులో వరుసగా రూ. 1750, రూ. 2000, రూ. 3250, రూ. 5000, రూ. 7000, రూ. 8000, రూ. 13500 విలువ గల టికెట్లు ఫ్యాన్స్‌ కోసం అందుబాటులో ఉన్నాయి. టికెట్లను  https://www.district.in/ events/goat-india-tour-2025-lionel-messi-hyderabad-buy-tickets  వెబ్‌ సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)