Breaking News

ఐపీఎల్‌లో తొలి సిక్సర్‌ కొట్టిన అర్జున్‌ టెండూల్కర్‌

Published on Tue, 04/25/2023 - 23:50

ముంబై ఇండియన్స్‌ ఆటగాడు అర్జున్‌ టెండూల్కర్‌ ఐపీఎల్‌లో తొలి సిక్సర్‌ బాదాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తొమ్మిదో నెంబర్‌ ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన అర్జున్‌ టెండూల్కర్‌ మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ బాదాడు. మోహిత్‌ షార్ట్‌ బాల్‌ వేయగా.. అర్జున్‌ డీప్‌స్వ్కేర్‌ దిశగా సిక్సర్‌ కొట్టడం హైలెట్‌గా నిలిచింది.

కాగా అర్జున్‌కు ఇదే తొలి సిక్సర్‌ కాగా.. తొలి ఐపీఎల్‌ సీజన్‌ కూడా. బౌలర్‌గా మంచి ప్రదర్శన కనబరిచిన అర్జున్‌.. ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ సిక్సర్‌తో అలరించడంతో సచిన్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అర్జున్‌ టెండూల్కర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ ఇవ్వాలని.. అతనికి మంచి టాలెంట్‌ ఉందని.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపిస్తే ముంబైకి మంచి ప్రయోజనం ఉంటుందని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

ఇక  మ్యాచ్‌ విషయానికి వస్తే ముంబై  ఇండియన్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. నెహల్‌ వదేరా 21 బంతుల్లో 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కామెరాన్‌ గ్రీన్‌ 33 పరుగులు, సూర్యకుమార్‌ 23 పరుగులు చేశాడు.

గుజరాత్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ మూడు వికెట్లు తీయగా.. రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు గుజరాత్‌ నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గిల్‌ 56, మిల్లర్‌ 46, అభినవ్‌ మనోహర్‌ 46 పరుగులతో రాణించారు.

చదవండి: ముంబై , గుజరాత్‌ మ్యాచ్‌.. ట్రెండింగ్‌లో సారా టెండూల్కర్‌!

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు