Breaking News

సాత్విక్‌–చిరాగ్‌ జోడీ కొత్త చరిత్ర

Published on Sat, 10/07/2023 - 03:21

ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్‌ చేరిన తొలి భారతీయ జోడీగా రికార్డు నెలకొల్పింది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–17, 21–12తో మాజీ ప్రపంచ చాంపియన్‌ ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ (మలేసియా)పై గెలిచింది.

46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ కళ్లు చెదిరే స్మాష్‌లతో, చక్కటి డిఫెన్స్‌తో ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. నేడు జరిగే ఫైనల్లో చోయ్‌ సోల్‌ జియు–కిమ్‌ వన్‌ హో (దక్షిణ కొరియా) జంటతో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం తలపడుతుంది.

తాజా ప్రదర్శనతో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జోడీ వచ్చే మంగళవారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్‌సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకునే అవకాశముంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌  ప్రణయ్‌ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో లేకుండానే సెమీఫైనల్‌ ఆడిన ప్రణయ్‌ 16–21, 9–21తో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌ లీ షి ఫెంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయాడు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)