Breaking News

పార్క్ హయత్ హోటల్‌లో అగ్నిప్రమాదం.. స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌కు త‌ప్పిన ముప్పు

Published on Mon, 04/14/2025 - 16:39

హైదరాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుకుంది. హోట‌ల్ మొద‌టి అంత‌స్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇదే హోట‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు బ‌స చేస్తోంది. 

ఈ ప్రమాద స‌మ‌యంలో ఎస్ఆర్‌హెచ్ టీమ్ స‌భ్యులు హోట‌ల్‌లోనే ఉన్నారు. ప్రమాద విషయం తెలిసి ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అక్కడి నుంచి ప్ర‌త్యేక బ‌స్సులో వెళ్లిపోయారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటల్ కు చేరుకుని పొగలను అదుపు చేశారు. 

మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ప్రమాదం సంభ‌వించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఏప్రిల్ 17న‌ వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నుంది. 

ఈ మ్యాచ్ కోసం స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌ సోమ‌వారం సాయంత్రం ముంబైకి బ‌య‌లు దేరాల్సి ఉంది. కానీ అంత‌లోనే ఈ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డంతో కాస్త ముందుగానే ఎస్ఆర్‌హెచ్ టీమ్ చెక్ అవుట్ చేసింది.

ఈ ఏడాది సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ టీమ్ కాస్త త‌డ‌బ‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన  6 మ్యాచ్‌ల్లో రెండు విజ‌యాలు మాత్ర‌మే సాధించింది. అయితే ఆఖ‌రి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై మాత్రం రికార్డు విజ‌యాన్ని ఎస్ఆర్‌హెచ్ అందుకుంది. 245 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌(141) భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)