Breaking News

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మహోగ్రరూపం.. 19 సిక్సర్లతో ఊచకోత

Published on Fri, 06/13/2025 - 09:42

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ మహోగ్రరూపం దాల్చాడు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (MLC) 2025 ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ లీగ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న అలెన్‌.. వాషింగ్టన్‌ ఫ్రీడంతో ఇవాళ (జూన్‌ 13) జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 19 సిక్సర్లు బాదాడు. పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో ఇవే అత్యధిక సిక్సర్లు. గతంలో ఈ రికార్డు క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది. గేల్‌ 2017 బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఓ మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాదాడు.

ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న అలెన్‌ 19 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అలెన్‌ సెంచరీని కేవలం 34 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఎంఎల్‌సీ చరిత్రలో ఇదే వేగవంతమైన సెంచరీ. గతంలో ఈ రికార్డు పూరన్‌ పేరిట ఉండేది. పూరన్‌ 2023 ఎడిషన్‌లో 40 బంతుల్లో శతక్కొట్టాడు. నేటి మ్యాచ్‌లో అలెన్‌  విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూనికార్న్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఎంఎల్‌సీ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌. గతంలో కూడా ఈ రికార్డు యూనికార్న్స్‌ (215/5) పేరిటే ఉంది.

నేటి మ్యాచ్‌లో యూనికార్న్స్‌ ఇన్నింగ్స్‌లో సంజయ్‌ కృష్ణమూర్తి 20 బంతుల్లో 36, హసన్‌ ఖాన్‌ 18 బంతుల్లో 38 (నాటౌట్‌), టిమ్‌ సీఫర్ట్‌ 10 బంతుల్లో 18, జేక్‌ ఫ్రేజర్‌ 9 బంతుల్లో 6, కూపర్‌ కన్నోలీ 7 బంతుల్లో 5, కోరె ఆండర్సన్‌ 6 బంతుల్లో 3 (నాటౌట్‌) పరుగులు చేశారు. వాషింగ్టన్‌ బౌలర్లలో జాక్‌ ఎడ్వర్డ్స్‌ 2, నేత్రావల్కర్‌, మిచెల్‌ ఓవెన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్‌ గట్టిగానే ఇన్నింగ్స్‌ ప్రారంభించినప్పటికీ.. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోతుంది. తొలి 5 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 79 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగుతుంది. 10 ఓవర్ల తర్వాత వాషింగ్టన్‌ స్కోర్‌ 118/8గా ఉంది. బెన్‌ సియర్స్‌ (1), ఇయాన్‌ హోలాండ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మిచెల్‌ ఓవెన్‌ (20 బంతుల్లో 39), రచిన్‌ రవీంద్ర (17 బంతుల్లో 42), వన్‌ డౌన్‌ ఆటగాడు జాక్‌ ఎడ్వర్డ్స్‌ (7 బంతుల్లో 21) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే ఆతర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ (5), గ్లెన్‌ ఫిలప్స్‌ (0), ఆండ్రియస్‌ గౌస్‌ (2), ఒబస్‌ పియనార్‌ (2), ముక్తార్‌ అహ్మద్‌ (1) దారుణంగా విఫలమయ్యారు. యూనికార్న్స్‌ బౌలర్లలో రౌక్స్‌, హసన్‌ ఖాన్‌, హరీస్‌ రౌఫ్‌ తలో 2 వికెట్లు తీయగా.. లియామ్‌ ప్లంకెట్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. ​

ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-4 బ్యాటర్లు..
ఫిన్‌ అలెన్‌-19 (న్యూజిలాండ్‌)
క్రిస్‌ గేల్‌-18 (వెస్టిండీస్‌)
సాహిల్‌ చౌహాన్‌-18 (సైప్రస్‌)
క్రిస్‌ గేల్‌-18 (వెస్టిండీస్‌)

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)